రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన 'డిపార్ట్ మెంట్' చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అమితాబ్ ... సంజయ్ దత్ ... రానా ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాపై ఇటు టాలీవుడ్ లోను, అటు బాలీవుడ్ లోను భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగులో 'నేను నా రాక్షసి' ... 'నా ఇష్టం' వంటి సినిమాల్లో రొమాంటిక్ హీరోగా కనిపించిన రానా, ఈ సినిమాలో శివన్నారాయణ అనే ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. ట్రైలర్స్ లో అతని యాక్షన్ సీన్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవటంతో యాక్షన్ హీరోగా రానా ఎలా చేశాడనే ఆశక్తి ప్రతిఒక్కరిలోనూ కనిపించింది. ఇక మంచు లక్ష్మీ ప్రసన్న ఇందులో ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తుండటం కూడా ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా మారనుంది. బాలీవుడ్ లో అమితాబ్ కీ ... సంజయ్ దత్ కి ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆల్రెడీ 'దం మారో దం ' చిత్రం ద్వారా అక్కడి ప్రేక్షకులకి రానా పరిచయమే. వర్మ విషయానికే వస్తే, ఇటువంటి సినిమాలు చేయడంలో ఆయన దిట్ట అనే సంగతి అందరికీ తెలిసిందే. పైగా నథాలియా కౌర్ తో ఓ ఐటంసాంగు పెట్టి, ఆమె గ్లామర్ కి ఎంత పబ్లిసిటీ ఇవ్వాలో అంత పబ్లిసిటీ ఇచ్చాడు.
ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా మీద ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తున్నట్టు తెలుస్తోంది.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more