Ram charan upasana wedding preparations

ram charan upasana wedding preparations

ram charan upasana wedding preparations

3.gif

Posted: 05/18/2012 01:52 PM IST
Ram charan upasana wedding preparations

      రామ్ చరణ్ వివాహ ఏర్పాట్లు ఊపందుకున్నాయి. వివాహ వేదికైన హైదరాబాదు శివారులోని ఫామ్ హౌస్ అన్ని హంగులతోనూ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుండగా,  చరణ్, ఉపాసనల లగ్నపత్రికకు చరణ్ తల్లి సురేఖ ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో పూజలు జరిపిస్తున్నారు. ఇవాళ సురేఖ తిరుమల శ్రీవారి చెంత లగ్నపత్రికనుంచి ప్రత్యేక పూజలు జరిపారు. నిన్న ఇంద్రకీలాద్రిపై వెలసిన విజయవాడ కనకదుర్గమ్మ పాదాల చెంత వుంచి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంలో దేవస్థానం ఈవో స్వాగతం పలికి,  ఆమెను ఆలయంలోకి తోడ్కుని వెళ్లారు.chiru_wife
      ఇదిలా ఉండగా, చరణ్ - ఉపాసన వివాహ వేడుకకి పలువురు సినీ ... రాజకీయ ... వ్యాపార ప్రముఖులు హాజరు కానున్న నేపథ్యంలో ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. పెళ్లి శుభలేఖలు మొదలు ప్రతి విషయంలోనూ   ఇరు కుటుంబాల వారు తమ స్థాయికి తగినట్టుగా ఖర్చు పెడుతున్నారట. శుభలేఖలని బ్రిటీష్ రాయల్ వెడ్డింగ్ తరహాలో వేయించాలనే ఉద్దేశంతో, కొన్ని నమూనాలను పరిశీలించినట్టు తెలుస్తోంది. 3 ఈ వివాహ వేడుక కోసం ఉపాసన వాళ్ల ఫాం హౌస్ లో కళ్ళు చెదిరే కళ్యాణ మంటపం సెట్ ని వేయనున్నట్టు సమాచారం. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద సాయి నేతృత్వంలో అత్యంత ఖరీదైన సెట్ ని వేయిస్తున్నారు. గతంలో బన్నీ ... ఎన్టీఆర్ ... వివాహ వేడుకల్లో సైతం ఆనంద్ సాయి వేసిన కళ్యాణ మంటపం సెట్లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మరింత గ్రాండ్ లుక్ తీసుకు రావడానికి ఆనంద్ సాయి ప్రయత్నిస్తున్నాడు.
       వేదిక అలంకరణకి అవసరమైన శాండిలియర్స్ ని చైనా నుంచి, క్రిష్టల్ డెకార్ ని UK నుంచి రప్పిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా అరుదైన అలంకారాలతో ముస్తాబౌతోన్నఈ కళ్యాణ మంటపం ... సంప్రదాయ బద్ధంగా కనిపిస్తుందనీ, అధునాతనంగా అలరిస్తుందని సన్నిహితులు అంటున్నారు. మరో నెలలో జరగనున్న  ఈ అతిపెద్ద వివాహ వేడుక కోసం మెగా అభిమానులేకాదు..  యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram gopal varma department movie release today
Cannes film festival  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles