Ss raja mouli shok for eega tamil rights

ss raja mouli shok for eega tamil rights

ss raja mouli shok for eega tamil rights

3.gif

Posted: 05/16/2012 01:09 PM IST
Ss raja mouli shok for eega tamil rights

       దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళికి షాక్ తగిలింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన తన 'ఈగ' సినిమా తమిళ వెర్షన్ థియరేటికల్ హక్కుల్ని 5 కోట్లకు నిర్మాత పీవీ ప్రసాద్ కు రాజమౌళి అమ్మేశాడు.sf రేటు బాగానే పలికిందని అప్పట్లో రాజమౌళి సంతృప్తి పడ్డాడు. అయితే, ఆ నిర్మాత తమిళ వెర్షన్ శాటిలైట్ హక్కుల్ని ఓ చానెల్ కి తాజాగా 3 కోట్ల 30 లక్షలకి అమ్ముకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి ట్వట్టర్ లో తెలిపాడు.  ఇది చూసి షాక్ అవ్వడం ఇప్పుడు రాజమౌళి వంతైంది.
       ఇటీవల సినిమా శాటిలైట్ హక్కుల అమ్మకాల విషయంలో ఇలాంటి పశ్చాత్తాప సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల పెద్ద హిట్టయిన చిన్న సినిమా 'ఈ రోజుల్లో' సినిమా శాటిలైట్ హక్కుల్ని ఆ సినిమా విడుదలకు ముందే ఓ మీడియేటర్ కు 30 లక్షలకు అమ్మేశారు. ఆ సమయంలో దానికి అదే పెద్ద రేటు అనుకున్నారు. తీరా సినిమా విడుదలై హిట్టవడంతో సదరు మీడియేటర్... శాటిలైట్ హక్కుల్ని ఓ చానెల్ కు 2 కోట్లకు అమ్ముకోవడంతో చిత్ర నిర్మాత ఆఖరున లబోదిబోమన్నాడు. ఏం చేస్తాం రాసిపెట్టుండాలనుకోవటం తప్ప.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Veteran actress sridevi sensational statement
Actress nayana tara as a dirty girl  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles