Veteran actress sridevi sensational statement

veteran actress sridevi sensational statement

veteran actress sridevi sensational statement

8.gif

Posted: 05/16/2012 01:21 PM IST
Veteran actress sridevi sensational statement

       అతిలోక సుందరి శ్రీదేవి మీడియా మీద ఒక బాంబు పేల్చారనే చెప్పాలి. భాగ్యనగరంలో హయత్ హోటల్ ప్రారంభ కార్యక్రమానికి వచ్చిన శ్రీదేవి తన కూతురుని సినిమాల్లో దింపేందుకు ప్రముఖులందరికీ పేరుపేరునా పరిచయం చేసిందని ఆమధ్య మీడియాలో పుంకాను పుంకాలుగా వార్తలొచ్చాయి.sri_ee అంతేకాదు.. శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవి తెరంగేట్రానికి అంతా రెడీ అయిపోయిందని, రామ్ చరణ్ – జాహ్నవి జంటగా జగదేకవీరుడు అతిలోక సుందరి రీమేక్ అనీ..,  నాగార్జున చిన్న కొడుకు అఖిల్ తో సినిమా ప్లాన్ చేస్తున్నారనీ ఆ మధ్య స్పెషల్ స్టోరీలు ప్రసారమయ్యాయి. అయితే అవన్నీ  పుకార్లేనని తేల్చేసింది శ్రీదేవి.. తన కుమార్తెకు అందంపట్ల ఆసక్తి ఎక్కువనీ.. తనతో పాటూ రెగ్యులర్ గా జిమ్ లకూ, బ్యూటీ పార్లర్ లకూ, కొన్ని కార్యక్రమాలకూ వస్తూ వుండటం చూసి చాలా మంది సినిమాలో ట్రయల్స్ కోసం చేస్తున్న ప్రయత్నాలుగా భావించారని అంటోంది.
     డైట్, శారీరక వ్యాయామం పట్ల తాను చాలా ఖచ్చితంగా, జాగ్రత్తగా వుంటానని తన పోలికే తన పిల్లలకూ వచ్చిందంటోంది. ఫిట్ నెస్ కోసం వారానికి రెండు సార్లు పిల్లలతో కలసి టెన్నిస్ ఆడటం శ్రీదేవి హాబీ. తనని బలవంతంగా శ్రీదేవే ఫిట్ నెస్ సెంటర్లు, బ్యూటీ పార్లర్ల చుట్టూ తిప్పుతోందన్న వార్తలపై జాహ్నవి కూడా మండిపడింది. అందం పట్ల, ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా వుండటం  తప్పా అని ఎదరు ప్రశ్నిస్తోంది.  ఇక నటన విషయంపైనా శ్రీదేవి స్పష్టంగానే వుంది. తన పిల్లలు సినిమాల్లో నటించడానికి ఇంకా సమయం వుందని, ఇద్దరూ ప్రస్తుతం స్కూలు చదువుల్లోనే వున్నారని శ్రీదేవి అంటోంది.    కాగా,  జుదాయ్ తర్వాత వెండితెరకు దూరమైన శ్రీదేవి.. బోనీ కపూర్ ని పెళ్లాడి అచ్చమైన గృహిణిలా మారిపోయింది. ముద్దు లొలికే ఇద్దరు పిల్లలకు తల్లయింది. అప్పుడప్పుడు ఫ్యాషన్ షోలలోనూ, పేజ్ త్రీ సమావేశాలకూ భర్త పిల్లలతో హాజరై  తళుక్కున మెరిసి ఆపై మాయమయ్యేది. శ్రీదేవి అభిమానులందరూ  ఆమె మళ్లీ నటించాలని, చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ అందాల నటి మాత్రం నటనంటే బోర్ కొట్టేసిందంటోంది. నా నాలుగేళ్ల  వయసు నుంచీ నటిస్తున్నాను.. షూటింగ్ లు, స్టూడియోలు, ఇల్లు.. జీవితమంతా ఇలాగే గడిచిపోయింది. నటిగా నేను చేయాల్సిన డ్యూటీ చేసేశాను. ఇక గృహిణిగా నా పాత్ర మిగిలి వుంది.. అందుకే  పెళ్లి చేసుకుని ఇంటి దాన్నయిపోయాను.. నా పిల్లలకు తల్లిగా వుంటున్నాను అంటోందీ తళుక్కు తార..సినీ పరిశ్రమలో నెంబర్ వన్ గా నిలదొక్కుకున్న శ్రీదేవి తన పిల్లలను మాత్రం ఇండస్ట్రీలోకి తెచ్చే ప్రసక్తి లేదని కుండ బద్దలు కొట్టింది. seeeee
 
    చిన్న తనంలో తనకు చదువు అబ్బలేదని ఆ పరిస్థితి తన  పిల్లలకి రాకూడదని ఆమె కోరుకుంటోంది. తన పిల్లలిద్దరూ నటన వైపు రారనీ, చదువులు పూర్తవగానే వాళ్లకి పెళ్లిళ్లు చేసి పంపేస్తాననీ శ్రీదేవి అంటోంది. ఇంగ్లీష్, వింగ్లీష్ సినిమా తన రీ ఎంట్రీ సినిమా కాదని, దీనికోసం ప్రత్యేకించి ప్లాన్ చేసిందేమీ లేదని అంటోంది.  కుటుంబమే ఆలంబనగా బతికిన మధ్య తరగతి గృహిణి అమెరికాలో ఒంటరిగా పడే పాట్లే ఇంగ్లిష్, వింగ్లీష్ కథాంశమని, స్టోరీ నచ్చడంతో ఒప్పుకున్నాననీ తెలిపింది. సో.. శ్రీదేవి వారసులెవరూ వెండితెరకెక్కరన్నది రూఢీ అయిపోయింది.
 
    అయితే మొత్తంగా తమకి అద్భుతమైన గుర్తింపును, మైలేజీని, పేరు ప్రఖ్యాతులను, డబ్బును ఇచ్చిన సినీ పరిశ్రమను సాధారణంగా ఏ నటులూ వదులుకోరు.. మరి శ్రీదేవి తన పిల్లలను వెండితెరకెక్కనివ్వనన్న  మాటకి కట్టుబడి వుంటుందా ? మాట మారుస్తుందా అనేది ప్రశ్నార్థకమే. పూల రెక్కలు.. తేనె చుక్కలు రంగరించి చేసిన బొమ్మలా వుండే ముగ్ధ మనోహర రూపమైన శ్రీదేవి తన వారసులని తెరకెక్కిస్తే చూడాలని అందరి ఆశ. ప్రేక్షకుల ఆశలు ఆడయాశలు కావనే అందాకా ఆశిద్ధాం...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sunil and naga chaitanya brothers relation
Ss raja mouli shok for eega tamil rights  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles