Young rebel star prabhas movie rebal sufferes

young rebel star prabhas movie rebal sufferes..

young rebel star prabhas movie rebal sufferes..

6.gif

Posted: 04/11/2012 02:25 PM IST
Young rebel star prabhas movie rebal sufferes

                rebal_inn_2222333444యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రెబల్’ చిత్రం ఆది నుంచీ ఇగోల ప్రాబ్లమ్ తో సతమతమౌతోంది.  దర్శక నిర్మాతలకి మధ్య తలెత్తిన మనస్పర్ధలు ఈ సినిమా ఆలస్యానికి కారణమౌతూ వచ్చాయనే వార్తలు ఫిల్మ్ నగర్లో ఇంకా వినిపిస్తున్నాయి.  ప్రభాస్ చేస్తోన్న 'రెబల్' చిత్రం గురించిన వివరాలు గానీ, 'వారధి' సినిమా గురించి విశేషాలుగాని ఆశించిన స్థాయిలో బైటికి రాకపోతుండటం ఈ వార్తలకు ఊతమిస్తున్నట్టు కనిపిస్తోంది.  
                ఇదిలా ఉండగా, ప్రభాస్ హీరోగా,  లారెన్స్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'రెబల్' చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. కథానాయిక తమన్నా,ముఖేష్ రిషి కి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను  చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో మరో కథానాయికగా దీక్షా సేథ్ తన వయ్యారాలను వొలకబోయనుంది.rebal_inn111
           కృష్ణంరాజుకి సంబంధించిన వెర్షన్ ని గతంలోనే చిత్రీకరించిన సంగతి తెలిసిందే. వచ్చేనెల రెండోవారం వరకూ హైదరాబాద్ పరిసరప్రాంతాల్లో షూటింగ్ జరపుకుంటుందని చిత్ర వర్గాల సమాచారం. అంతకుముందు శంషాబాద్ లో ఈ మూవీ షూటింగ్ జరిగింది.  కేవలం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చిత్రీకరణకే రెండు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారు. 25 లక్షలతో ఓ భారీ సెట్ వేసి, అందులో 20 అడుగుల కాళీమాత విగ్రహాన్ని ప్రతిష్టించి ఈ షూటింగు చేశారు.  కృష్ణంరాజు, ప్రభాస్, దీక్షా సేథ్, ప్రభ, ముఖేష్ రుషి, సుప్రీత్ లతో బాటు 100 మంది ఫైటర్లు, 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో పాల్గొన్నారు. టెక్నికల్ గా కూడా హై స్టాండర్డ్స్ తో  నిర్మించబోతోన్న ఈ మూవీకి మొత్తంగా 40 కోట్ల బడ్జెట్ తో  రూపొందించనున్నామని నిర్మాతలు భగవాన్, పుల్లారావు చెప్పిన మాటలు వమ్మై, బడ్జెట్ మరింత పెరిగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hero uday kiran new movie mee peddollunnare
Heroine sradhaa das movie chance missing  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles