Rajani kanth new movie kochhadiyan

rajani kanth new movie kochhadiyan

rajani kanth new movie kochhadiyan

13.gif

Posted: 04/06/2012 09:31 PM IST
Rajani kanth new movie kochhadiyan

             raja_inn_777కొంతకాలం విరామం తర్వాత తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఉగ్రరూపుడై రుద్రతాండవం చేయనున్నాడు. ఆయన కథానాయకుడుగా, కూతురు సౌందర్య రూపొందిస్తున్న 'కొచ్చాడియాన్' చిత్రంలో రుద్రతాండవం చేయబోతున్నాడు రజని.  కాగా, ఈ చిత్రం మూడు వారాల లండన్ షెడ్యులును పూర్తి చేసుకుని ఇటీవలే యూనిట్ చెన్నయ్ చేరుకుంది. తదుపరి షెడ్యులు షూటింగు కేరళలో నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందు కోసం కేరళలోని అందమైన లొకేషన్లో ఓ భారీ భవంతి సెట్ ను వేయడానికి ప్లానింగ్ జరుగుతోంది. ఈ ప్యాలెస్ సెట్లో రజనీకాంత్, శరత్ కుమార్, దీపికా పదుకొనే లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని సమాచారం.
                హాలీవుడ్ చిత్రం 'అవతార్' ను నిర్మించిన మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ పద్ధతిలో ఈ 'కొచ్చాడియాన్' చిత్రాన్ని 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. వ్యయ ప్రయాసలకు ఏమాత్రం లెక్కచేయక చాలా ప్రతిష్టాత్మకంగా సౌందర్య ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jrntr working on six pack body
Hero srikanth and akksha new movie starts from today onwards  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles