Top producer allu arvind

top producers, allu arvind, and dil raju, make a movie ,in a few days from now ,as ravi kumar chowdary, is the director of this movie,

top producers allu arvind, and dil raju make a movie in a few days from now as ravi kumar chowdary is the director of this movie

3.gif

Posted: 02/06/2012 12:01 PM IST
Top producer allu arvind

allu_arvindతెలుగు చలన చిత్ర రంగంలో మరో భారీ చిత్రం నిర్మాణం కాబోతోంది. ఈ ఉద్ధండుల కలయికే అందుకు తార్కాణం. మగధీర, జల్సా వంటి బ్లాక్ బస్టర్స్ అందించిన మెగా ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌.. ‘బృందావనం’, ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన దిల్‌రాజు కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందనుంది.

dil_rajuఈ చిత్రానికి ‘యజ్ఞం’లాంటి కమర్షియల్‌ హిట్‌ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు ఎఎస్‌ రవికుమార్‌చౌదరి దర్శకత్వం వహించనున్నారు. అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్‌, దిల్‌రాజులకు సన్నిహితుడు...‘100%లవ్‌’ లాంటి ఉత్తమాభిరుచి చిత్రం అందించిన నిర్మాత బన్నివాసు నిర్మాణ సారధ్యం వహిస్తున్నారు.

as_ravikumar_chowdaryఆడియన్స్‌ పల్స్‌ తెలుసుకుని విజయవంతమైన చిత్రాలు రూపొందించడంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉద్దండులైన అల్లు అరవింద్‌, దిల్‌రాజులు సంయుక్తం ఈ చిత్రాన్ని రూపొందించడం సినిమా పరిశ్రమకు శుభపరిణామం. కథలు, బడ్జెట్‌ కంట్రోల్‌ వంటి విషయాలలో ఎక్కువ శ్రద్ధపెట్టే ఈ మెగా ప్రొడ్యూసర్స్‌ ఇద్దరూ కలిసి రూపొందిస్తున్నారనగానే ఇప్పటికే ఫిలిం ట్రేడ్‌ మార్కెట్‌లో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

banny_vaasu.jpegఓ యువ హీరో ఈ చిత్రంలో నటించనున్నాడు. ఈ చిత్రం కథను దర్శకుడు ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి ఈ అగ్ర నిర్మాతలకు మొదట చెప్పగానే కథ విని ఎంతగానో ఎగ్జయిట్‌ అయ్యారట ఇద్దరు. టాలీవుడ్‌లోనే మంచి క్రేజీ పిక్చర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన వివరాలు అతి త్వరలో తెలియజేస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ మెగా మూవీలో హీరోగా నటించే అద్భుత అవకాశం ఏ హీరోకు దక్కుతుందో వేచిచూడాలి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nandamoori bala krishna latest movie kalki
Bollywood actress madhuri deekshit  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles