Radha daughter karthika debuting in bollywood

karthika daughter of radha debuting in bollywood film, karthika debut in bollywood, karthika in bollywood films,akshay kumar and karthika 's film,karthika's bollywood debut,movie news

Yesteryear’s beautiful actress Radha’s daughter Karthika who made her debut in Tollywood with Josh pairing with Naga Chaitanya has later acted in Kollywood film Ko Rangam in Telugu in KV Anand’s direction and earned positive reviews for her performance opening up with big and completed 50 days of run successfully

Radha daughter karthika debuting in bollywood.gif

Posted: 01/30/2012 05:26 PM IST
Radha daughter karthika debuting in bollywood

Karthika

ఒకప్పుడు ఎనభయ్యవ దశకంలో కుర్రకారు గుండెల్లో గుబులురేపిన బ్యూటీ క్వీన్‌ రాధ హీరో చిరంజీవితో కలిసి హిట్‌పెయిర్‌గా అనేక చిత్రాలలో నటించింది. ఇప్పుడు ఆమె కూతురు కార్తికను తెలుగులో నాగచైతన్య హీరోగా ‘జోష్‌’ సినిమాతో తెరంగేట్రం చేయించినా ఆ చిత్రంతో సరైన బ్రేక్‌ రాలేదు. తెలుగులో అవకాశాలే లేని పరిస్థితికి ఈ అమ్మడు చేరుకుంది. తమిళంలో హీరో జీవాతో కలిసి నటించిన ‘కో’ చిత్రం కార్తీక లైఫ్‌ స్టయిల్‌నే ఒక్కసారిగా మార్చేసింది. వెనువెంటనే ఈ కుర్ర భామకు మూడు భాషల్లో హీరోయిన్‌గా అవకాశాలు వెల్లువెత్తాయి. కో చిత్రం తెలుగులో రంగం పేరిట విడుదలై ఇక్కడా ఘనవిజయం సాధించింది. కాగా కార్తిక లేటెస్ట్‌ గా ‘దమ్ము’ చిత్రంలో రెండో హీరోయిన్‌గా ఎన్టీఆర్‌ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. ఇదేగాక బాలీవుడ్‌లో ‘కో’ చిత్రం రీమేక్‌ అవుతోంది. ఈ చిత్రంలో హీరో అక్షయ్‌కుమార్‌ సరసన నటించనున్నట్లు సమాచారం. ఇదేగాక మలయాళంలోనూ ఓ చిత్రంలో నటిస్తోంది. కాగా తెలుగులో ‘దమ్ము’ చిత్రం తర్వాత మరికొన్ని చిత్రాలలో కార్తికకు అవకాశం దక్కే ఛాన్సుంది. ఏదేమైనా.. కార్తికది టైం బాగున్నట్లే కనిపిస్తోందని సినీ పండితులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ravi teja to share screen with kamal hasan
Vidya balan do an item song  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles