Actress tabu takes salsa lessons

Actress tabu, akkineni nagarjuna tabu, heroine tabu, salsa dancer tabu, tabu tollywood actress" />

Posted: 01/30/2012 03:19 PM IST
Actress tabu takes salsa lessons

     Tabu-Salsa-dance

     టబూ తెలుగు ప్రేక్షకులకే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు సుపరిచితురాలు. టాలీవుడ్ ప్రేక్షకులకైతే ఒకప్పుడు టబూ కలలరాణి. ఆమె ఒంపుసొంపులు ఆమె సినిమాలు చూసిన ప్రతి ప్రేక్షకునికి కలలోవస్తాయి. అంతలా అందచందాలు కలిగిన టబూ ఈ మధ్య తెలుగులో కొన్ని ముఖ్యపాత్రతలో మాత్రమే పోషిస్తుంది. జీవితలో ప్రతి వాళ్లకీ ఓ ఆశయం ఉంటుంది. అది నెరవేర్చుకోవాలనే తపన ఉంటుంది. కొంతమంది మాత్రం అనుకున్న గమ్యానికి చేరుకున్నా అక్కడ విశ్రాంతి తీసుకోరు. తమదైన ప్రత్యేకతను కాపాడుకోవడం కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. ఇప్పుడు అలాంటి వారి జాబితాలోనే టబూ కూడా చేరిపోయింది. అందం-అభినయం కలగలసిన కథానాయికగా ఆమె పలు భాషల్లో గుర్తిపు తెచ్చుకుంది. ఎన్నో విభిన్న మైన పాత్రలని పోషించి ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకుంది. అయినా డాన్స్ పట్ల తనకున్న మక్కువని ఆమె మానుకోలేదు.
    ముంబైలోని ఓ నృత్య పాఠశాలలో ఆమె సల్సా-బాల్రూమ్ వంటి నృత్యాలు నేర్చు కుంటోందట. ఆమె తన సినిమాల్లో నృత్య ప్రాధాన్యత గల పాత్రలు చేయకపోతున్నప్పటికీ, కొత్త తరహా నృత్యాలు నేర్చుకుంటోందని తెలుస్తోంది. ఎవరికీ తెలియకుండా ఏదో ఓ సమయంలో టబూ అక్కడికి వచ్చి, శిక్షణ తీసుకుని వెళుతోందని నిర్వాహకులు చెపుతున్నారు. ఏదేవైనా తబూ ప్రయత్నం ప్రశంసనీయమని కొందరంటుంటే, మనసుంటే మార్గముంటుంది... మనీ ఉంటే అది నెరవేరుతుంది అని  మరికొందరు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Agneepath 2012 hrithik roshan movie
Trisha fire on media  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles