Noted film actress sruthi haasan

noted film actress, sruthi haasan, birth day, today ,

noted film actress sruthi haasan birth day today

10.gif

Posted: 01/28/2012 03:41 PM IST
Noted film actress sruthi haasan

           sruthi_hasan.3అందాల సుందరి ‘శ్రుతి హసన్’ నేడు తన 25వ ఏట అడుగిడింది. ప్రముఖ నటుడు కమల్ హాసన్, సారిక సంతానమైన ఈ అమ్మడు సినీ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటుంది. జనవరి 28, 1986న చెన్నైలో పూట్టిన శ్రుతి,  చిన్ననాటినుంచీ అన్నింటా తన ప్రతిభను చాటుకుంది. యాక్ట్రెస్ గా, సింగర్ గా, మొడల్ గానేకాక,  మ్యూజిక్ కంపోజర్ గా సైతం ఆమె అనేక సందర్భాలలో తన సత్తా రుజువుచేసుకుంది.  


           ఈ ఏడాది బర్త్ డే పార్టీని చాలా ప్రత్యేకం గా జరుపుకుంటుంది శ్రుతి. ప్రస్తుతం ఆమె ముంబైలో తన తల్లి, చెల్లెలుతో ఈ వేడుకలో ఎంజాయ్ చేస్తోంది.  అలాగే సినిమాల్లోకూడా ఇకపై మరింతగా తన హవా చాటుకోబోతోంది. ఈ  సంవత్సరం శ్రుతి  తెలుగు, తమిళ భాషల్లో పెద్ద సినిమాలే చేస్తుంది.  పవన్ కళ్యాణ్ సరసన ‘గబ్బర్ సింగ్’,  ధనుష్ తో చేసిన 3 సినిమా త్వరలో విడుదల కానున్నాయి.sruthi_inner


           గత సంవత్సరం ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో వచ్చిన ‘అనగనగా ఒక ధీరుడు’ చిత్రంతో శ్రుతిహాసన్ తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆమె నటించిన ‘ఓ మై ఫ్రెండ్’ చిత్రం విజయం సాధించగా,  హరీష్ శంకర్ డైరెక్షన్లో రానున్న గబ్బర్ సింగ్ చిత్రంలో పల్లెటూరి అమ్మాయిలా కనిపించబోతుంది. తెరపై కనిపించటం మొదలెడిన అనతి కాలంలోనే శ్రుతి చాలా పెద్ద హీరోల సరసన నటించే అవకాశం కొట్టేసింది. కాల్షీట్లు ఇవ్వటం కుదరక యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాను సైతం అప్పట్లో వదులుకుంది ఈ బిజీ హీరోయిన్.


          తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ తన ప్రతిభను చాటుతున్న శ్రుతి హాసన్ కు ఆంధ్రావిశేష్.కామ్ జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ, ఇంకా ఎన్నో విజయాలు సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తోంది. ఆల్ ద బెస్ట్ శ్రుతి....

…avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Godavari jillallo gundello godaari
Hero srihar director r narayana murty new movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles