Hero srihar director r narayana murty new movie

hero srihar ,director, r narayana murty, new movie, starts ,from yesterday,onwards at,sompeta ,

hero srihar director r narayana murty new movie starts from yesterday onwards at sompeta

4.gif

Posted: 01/28/2012 12:18 PM IST
Hero srihar director r narayana murty new movie

sri_hari సోంపేట కాల్పుల ఘటన ఆధారంగా విప్లవాత్మక సినిమాల దర్శకుడు ఆర్ నారాయణమూర్తి ఓ చిత్రాన్ని తెరకెక్కించాలని యత్నిస్తున్నారని అందుకోసం ఆయన సోంపేట ప్రాంతంలో పర్యటిస్తున్నారని ఇంతకు ముందు వివరించాం. ఇప్పుడు అదే చిత్రం మొదలైపోయింది.

 

సోంపేట బీల ప్రాంతంలో థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం కథాంశంగా ఈ సరికొత్త చిత్రం తెరకెక్కబోతోంది. స్నేహచిత్ర పిక్చర్స్ బ్యానర్‌పై ఆర్.నారాయణమూర్తి నిర్మిస్తున్న ఈ మూవీకి టైటిల్ ‘పీపుల్స్‌వార్’(సోంపేట సైరన్ మోత). సినిమా షూటింగ్ సోంపేట మండలం పలాసపురం గ్రామంలో ప్రారంభమైంది. కెమెరామేన్ విజయ్‌కుమార్ క్లాప్ ఇచ్చి, షూటింగ్‌నుప్రారంభించారు.

 

తొలుత కథానాయకుడు శ్రీహరిపై పాట సన్నివేశాలను చిత్రీకరించారు. దర్శకత్వం, నిర్మాణం, కథ, స్రీన్‌ప్లే బాధ్యతలను నారాయణమూర్తి వహిస్తున్నారు. అంతేకాకుండా థర్మల్ వ్యతిరే క పోరాటంలో అసువులు బాసిన గున్న జోగారావు తండ్రి పాత్రను ఆయన పోషిస్తున్నారు. సుద్దాల అశోక్‌తేజ, జి.వెంకటరావు, సోంపేట మండలం బారువ గ్రామానికి చెందిన కాళిదాసు, ధర్మవరం వెంకటరమణ తదితరులు రాసిన 10 పాటలు సినిమాలో ఉంటాయి.r_narayana_m

 

హీరో జోగారావు పాత్రలో శ్రీహరి నటిస్తున్నారు. కథానాయికగా తాన్వి, ప్రధాన పాత్రల్లో పోసాని కృష్ణమురళి, తెలంగాణ శకుంతల, ఇంకా ఉత్తరాంధ్ర కళాకారులు ఇతర తారాగణం.

 

నారాయణమూర్తి సినిమాలో నటించాలనే నా ఎనిమిదేళ్ల కోరిక ఈ సినిమాతో తీరిందని ఈ సందర్భంగా హీరో శ్రీహరి తన మనసులో మాట బయటపెట్టారు.

 

…avnk


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Noted film actress sruthi haasan
Dear dubbing telugu movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles