Akkineni nagarjuna

akkineni nagarjuna, latest movie, on the basis of, shridi sainath, titled, shiridi sai,

akkineni nagarjuna latest movie on the basis of shridi sainath titled shiridi sai

2.gif

Posted: 01/27/2012 11:53 AM IST
Akkineni nagarjuna

nagవిభిన్న తరహా పాత్రలతో కూడిన సినిమాలు చేసేందుకు ఎక్కువ మక్కువ చూపే నాగార్జున మరో భక్తిరస పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇంతకుముందు 'అన్నమయ్య', 'శ్రీరామదాసు' వంటి చిత్రాల్ని అందించిన నాగార్జున, కె. రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో ఈ చిత్రం రాబోతోంది. తన నిస్వార్థ పూరిత సేవతో ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్న బాబా షిరిడి సాయి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.

షిరిడీ సాయి పేరుతో వస్తోన్న ఈ చిత్రాన్ని సులోచనారెడ్డి సమర్పణలో సాయికృప ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై ఎ. మహేశ్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ భక్తిరస చిత్రానికి సంబంధించి పాటల రికార్డింగ్ పూర్తయింది. ఫిబ్రవరి 2న కర్ణాటకలోని ఓ మారుమూల గ్రామంలో షూటింగ్ ప్రారంభమవుతుందనీ, తొలి షెడ్యూలు 25 రోజులపాటు అక్కడే జరుగుతుందనీ నిర్మాత వెల్లడించారు.raghavendrarao

           పరుచూరి బ్రదర్స్ సంభాషణలు రాస్తున్న ఈ చిత్రానికి కథా సంకలనం: భక్త సురేశ్ డి., కథా సహకారం: పొందూరి హనుమంతరావు, పాటలు: సుద్దాల అశోక్‌తేజ, చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, వేదవ్యాస్, సత్తిపండు, ఛాయాగ్రహణం: ఎస్. గోపాలరెడ్డి, కళ: భాస్కరరాజు, శ్రీకాంత్.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Devudu chesina manushulu
Murali mohan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles