Devudu chesina manushulu

devudu chesina manushulu, is the latest movie ,in the combination of, poori jagannath, and raviteja,

devudu chesina manushulu, is the latest movie in the combination of poori jagannath and raviteja

10.gif

Posted: 01/27/2012 03:33 PM IST
Devudu chesina manushulu

         ravi_poori_new_movie రిలయన్స్ సంస్థ నిర్మాణంలో తెలుగు సినిమాల జాతర మొదలైందని ఇటీవలనే వెల్లడించాం. ఇప్పుడు ఆ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఓ భారీ చిత్రం మొదలు కాబోతోంది. దేవుడు చేసిన మనుషులుటైటిల్ తో రాబోతోన్న ఈ చిత్రానికి సన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహిస్తుండగా, మాస్ మహరాజా రవితేజ హీరోగా నటిస్తున్నారు. ఇలియానా హీరోయిన్. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

          ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి 17 నుంచి స్టార్ట్ అవుతుంది. రెగ్యులర్ షూటింగ్ మార్చి 1 నుంచి ఏకధాటిగా సాగించి, జూన్ లో సినిమా విడుదల చేయాలని సంకల్పిస్తున్నారు. పూరీ-రవితేజ కాంబినేషన్లో వస్తోన్న ఐదవ చిత్రమిది. ఇందులో రవితేజ క్యారక్టరైజేషన్ చాలా డిఫెరెంట్ గా ఉండబోతుందని సమాచారం. వంద శాతం కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందుతుందని నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ చెబుతున్నారు. reliance_media_works

          ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, సంగీతం : రఘు కుంచె, ఫైట్స్ : విజయ్, ప్రొడక్షన్ డిజైనర్ చిన్నా. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : పూరీ జగన్నాథ్.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tanikella bharani
Akkineni nagarjuna  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles