Murali mohan

murali mohan, reacts, on media, about, chiru, balayya, hard talks,

murali mohan reacts on media about chiru balayya hard talks

6.gif

Posted: 01/26/2012 03:11 PM IST
Murali mohan

        chiru_balayya  ఇటీవల కాలంలో చిరంజీవి-బాలయ్యబాబు ల మధ్య జరిగిన మాటల తూటాలు న్యూస్ ఛానళ్లకు పండుగ చేశాయి. ప్రత్యేక కథనాలు, స్టోరీలు, చర్చాగోష్టిలతో హోరెత్తించారు. ఇన్నేళ్ల చిరు-బాలయ్య నటజీవితంలో ఎన్నడూ రచ్చకెక్కని వీరి సంబంధాలు ఈ నేపథ్యంలో హాట్ టాపిక్ గా మారాయి.

          ఇయితే వీటికి విరుగుడుగా ఇవాళ తాజాగా ఓ ప్రకటన బయటకి వచ్చింది. అది ప్రముఖ సినీ నటడు, తెలుగుదేశం పార్టీ నేత మురళీ మోహన్ వెల్లడించింది. ‘చిరంజీవి బాలకృష్ణ ఇద్దరూ మంచి మిత్రులు, మీరు అనవసరంగా వారిద్దరి మధ్య విభేదాలు సృష్టించవద్దు.’ అని ఆయన మీడియాకు విజ్ఞప్తి చేశారు.

          అటు, అభిమానులు కూడా రాజకీయాలను సినిమాలతో ముడిపెట్టి అనవసరంగా ఘర్షణలకు దిగరాదని మురళీ మోహన్ సూచించారు. ఇవాళ ఆయన శంషాబాద్ లో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంలో విలేఖరులతో ఈ వ్యాఖ్యలు చేశారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Akkineni nagarjuna
Director teja new movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles