Ratnavali telugu movei

ratnavali telugu movei its a mafatlal fyabrics movie casting sunil sarma and pooja bhalootiya

ratnavali telugu movei its a mafatlal fyabrics movie

8.gif

Posted: 01/23/2012 12:39 PM IST
Ratnavali telugu movei

7ఎమ్ వి ఎస్ క్రియేషన్స్ పతాకంపై అల్లాడి శ్రీధర్ దర్శకత్వంలో మచ్చా శ్రీనివాసరావు నిర్మిస్తోన్న చారిత్రాత్మక చిత్రం రత్నావళి’. మఫత్ లాల్ ఫ్యాబ్రిక్స్ సమర్పిస్తోన్న ఈ సినిమా రీ రికార్డింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం గ్రాఫిక్ వర్క్ జరుపుకుంటుంది. త్వరలోనే ఆడియో విడుదల చేసి ఫిబ్రవరి మూడో వారంలో సినిమా విడుదలన చేస్తామని నిర్మాత మచ్చా శ్రీనివాసరావు చెబుతున్నారు.

ఇక సినిమా కథ విషయానికొస్తే, రత్నావళినిండు యవ్వనంలో వున్న పెళ్లికూతురు. భర్త తులసీదాస్ మహాకవి కావలసిన వాడు. అయితే అతను తొలిరాత్రి నుంచే భార్యే సర్వస్వంగా శారీరక వాంఛతో రాగిలిపోతాడు. క్షణిక సుఖమే శాశ్వతపరమానందంగా భ్రమిస్తాడు. కళ్లు తెరిస్తే అందమైన స్త్రీ దేహం. కళ్లు మూస్తే ఆనందపు స్త్రీ సుఖం.. భర్త పూర్తిగా తనకు దాసుడు కావడం ఎంతో సంతోషాన్ని కలిగించినా క్రమక్రమంగా తన బాధ్యత తెలుసుకుంది రత్నావళి.

అర్థరాత్రి ప్రళయ భీభత్సమైన వర్షంలో, పొంగిపొర్లుతున్న నదిని దాటుకుని, తన పొందుకోరి వచ్చిన భర్తను తిరస్కరిస్తుంది. ఈ పరిణామక్రమంలో వారి దాంపత్య బంధం ఎలా మారిపోయింది.. అతనే హనుమాన్ చాలీసా, రామచరితమానసం రచించిన మహాభక్త కవి తులసీదాస్ గా ఎలా ప్రసిద్ధికెక్కాడు.. అనేది చిత్ర ఇతివృత్తంతం.

తులసీదాస్ గా సునీల్ శర్మ నటించగా, రత్నావళిగా పూజా బలూటియా ప్రధాన పాత్రలు పోషించారు. కాశీరాజుగా సుమన్, మీరాబాయిగా వాణీ విశ్వనాథ్. హనుమంతుడుగా విందూసింగ్, సూరదాసుగా ఏవీఎస్, వాల్మీకి గా విజయచందర్ నటించారు.

         

…avnk      

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sms movie audio launch
Leading music director  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles