Leading music director

leading music director taman doing lot of films in tolly wood

leading music director taman

4.gif

Posted: 01/23/2012 11:56 AM IST
Leading music director

4అనతి కాలంలోనే బిజీబిజీ అయిపోయారు సంగీత దర్శకుడు తమన్. ఇప్పటికే పలు భారీ చిత్రాలకు సంగీతం అందించిన ఈ యంగ్ మేన్ తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిత్రాలకు సై అంటున్నారు. రామ్ చరణ్..వివి వినాయక్ కాంబినేషన్ వస్తోన్న సినిమాకు, ఎన్టీఆర్..శ్రీను వైట్ల కలయికలో వస్తోన్న చిత్రానికి తమన్ స్వరాలు సమకూర్చనున్నారు. అంతేకాదు సిద్ధార్థ్..అమలాపాల్ జంటగా నటిస్తోన్న లవ్ ఫేల్యూర్ చిత్రానికీ తమనే సంగీత దర్శకుడు కావటం విశేషం.

ఇవే కాదండోయ్ మరికొన్ని చిత్రాలకు ఈ యువ మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం అందించేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. ఇంతకుముందే సంక్రాంతి పండుగకు విడుదలై సంచలనం చేస్తోన్న బిజినెస్ మేన్’ ‘బాడీగార్డ్చిత్రాలకూ మన ఘంటసాల సాయి శ్రీనివాస్ తమన్ శివకుమార్ సంగీతాన్నందించిన సంగతి విదితమే. అన్నట్టు.. ప్రముఖ దర్శకుడు శంకర్ సినిమా బాయ్స్లో నటించిన కుర్రాళ్లలో డ్రమ్స్ కొడుతూ కనిపించింది తమనేనండోయ్..

…avnk      

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ratnavali telugu movei
Allu arjun  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles