Mahesh babu busy in signing for new films

mahesh babu busy in signing for new films, Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

mahesh babu busy in signing for new films, Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

mahesh-babu-1.gif

Posted: 11/28/2011 03:29 PM IST
Mahesh babu busy in signing for new films

mahesh-image     దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఆత్రుత హీరోయిన్లలో ఎక్కువగా ఉంటుంది. హీరోలతో పోలిస్తే హీరోయిన్ల చిత్రజీవిత కాల పరిమితి చాలా తక్కువ అవటమే అందుకు కారణం. అగ్ర హీరోలతో జంటగా నటించినవారు త్వరలోనే వారికి తల్లి, వదిన, అత్త పాత్రలలోకి ఒదిగిపోవటానికి సిద్ధపడాల్సివస్తుంది. కానీ హీరో ఎంత పెద్దయినా హీరోయే. అందువలన హీరోయిన్లు సామాన్యంగా అవకాశాలను వదులుకోరు మరీ వాళ్ళ ఇమేజ్ కి భిన్నంగా ఉండి, దానివలన సినిమా అవకాశాలు రావేమో అనే భయం ఉంటే తప్ప.

     కానీ మహేష్ బాబు విషయంలో కూడా ఈ సూత్రం పనిచేస్తోంది. అందుకు కారణం ఏమిటో అర్థం చేసుకోవటం చాలా సులభం. అంతకు ముందు తాపీగా సినిమాలను పూర్తి చేసుకునే మహేష్ బాబు ఇప్పుడు చకచకా పూర్తి చేస్తూ, కొత్త సినిమాలకు ఒప్పందాలు చేసుకోవటంలో బిజీ అయ్యారు. ''దూకుడు'' సినిమాలో మహేష్ బాబు ముఖంలో పసితనం కాస్త తగ్గినట్టుగా గమనించిన సినీ ప్రేమికులు బాధపడుతున్నారు. మహేష్ కి ప్రత్యేకమైన పసివాడని ముఖకవళిక అతనికి ఇన్నాళ్ళూ పెద్ద ఆస్తిగా ఉంది. అమాయకత్వం కానీ, ప్రేమ కానీ, దురుసుతనం కానీ, మంచితనం కానీ ఏ హావభావమైన సులభంగా పలికించే మహేష్ ముఖంలో కొద్దిగా ముదురు ఛాయలు కనిపిస్తున్నాయి.

     అందుకేనేమో మహేష్ ''దూకుడు'' అయిపోతూనే ది బిజినెస్ మన్ చిత్రీకరణలో చురుగ్గా పనిచేస్తూనే, క్రిష్ దర్శకత్వంలో వెంకీతో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, ఆ తర్వాత వెంటనే కరుణాకరన్ దర్శకత్వంలో ఒక ప్రేమ కథా చిత్రంలో చెయ్యటానికి ఒప్పందం కుదుర్చుకున్నారు.

శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nara rohit to work hard to support tdp in star image
Rajendra prasad new movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles