• masa
  • masa
Simha Raasi

ఆదాయం : 8 వ్యయం : 14 రాజపూజ్యం : 1 అవమానం : 5

మార్చి : ఆశించిన రీతిలో వ్యవహారాలు అనుకూలంగా అవుతాయి. వ్యాపార సంబంధ విషయాల్లో ముందుచూపుతో వ్యవహరిస్తే మంచిది. ఉద్యోగులకు స్థానచలన సూచనలున్నాయి.

ఏప్రిల్ : తొందరపాటు తనంతో కలహాలు ఏర్పడే సూచనలున్నాయి. సరదాగా చేసే సంభాషణలు వికటిస్తాయి. పరులయందు అసూయద్వేషాలు కలిగి వుంటారు. మాసాంతంలో ఆశించిన వస్తులాభం చేకూరుతుంది. భోజన సౌఖ్యం, సంతోషకర వాతావరణం, వృత్తి స్థిరత్వం.

మే : వ్యాపారవృద్ధి, రుణాలకై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబసభ్యులకు అండగా నిలుస్తూ ధైర్యవచనాలు పలుకుతారు. ఇష్టకార్య సిద్ధి, భోజన సౌఖ్యం వుంటుంది.

జూన్ : వ్యాపారులకు భాగస్వాములతోనూ, పనివారితోనూ సదవగాహనాలు కలిగి వుండాలి. విద్యార్థులకు కృషి విఘ్నములు ఎదురవుతాయి.

జూలై : సంతానం గురించి శుభవార్తలు అందుతాయి. కానీ.. మనో విచారం, భోజన అసౌకర్యం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. శరీర ఆరోగ్యం, ధన వస్త్రలాభం వంటివి చేకూరుతాయి.

ఆగస్టు : కొన్ని కారణాల వల్ల పరప్రాంతంలో కొన్నాళ్లు నివసించాల్సి వుంటుంది. కంటికి సంబంధించిన అనారోగ్యములు నత్తనడకన సాగుతాయి. గతంలో నిలిచిపోయిన పరిష్కరించలేని సమస్యలు ఓ కొలిక్కి వస్తాయి.

సెప్టెంబర్ : వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా వుండాలి. అనవసర విషయాలయందు ఆసక్తి కలిగి వుంటారు. నిలకడ లేని నిర్ణయాలు తీసుకుని, ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. అజాగ్రత్త, పరధాన్యముల వల్ల నష్టసూచన.

అక్టోబర్ : ద్రవ్యలాభం, సౌఖ్యం పొందుతారు. ప్రయత్నాలు ముమ్మరం చేస్తే కార్యాల్లో మరింత లాభం పొందుతారు. వివిధ రకాల ఆలోచనలు, పుత్రసంతానం గురించి ఆందోళనలు చెందుతుంటారు.

నవంబర్ : మంచి చేయడానికని ముందుకెళ్లే చెడు ఎదురవుతుంది. మానసిక చికాకులు, గృహసౌఖ్యం లేకపోవడం వంటి సమస్యలు వెంటాడుతాయి. శారీరక అలసట వల్ల వృత్తి, వ్యాపారాలయందు ఆసక్తి సన్నగిల్లుతుంది. మాసాంతంలో కొంతవరకు ఉపశమనం కలుగుతుంది.

డిసెంబర్ : వ్యాపార వ్యవహారాల్లో కొత్త ఒప్పందాలు కలిసి వస్తాయి. సుకార్యం వల్ల సంఘంలో కీర్తిప్రతిష్ఠలు కలుగుతాయి. ఇష్టసంపద పెరుగుతుంది. ఆరోగ్యం, నిరంతర కృషి, ఎప్పుడూ ఉల్లాసంగా వుంటారు.

జనవరి : సోదరమూలంగా ధనలాభం చేకూరుతుంది. కొన్ని సందర్భాల్లో వ్యయప్రయాసలు వున్నా.. ముందడుగు వేస్తారు. ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తూ కష్టాల్లోనూ తగిన ఫలితాలు పొందుతారు. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా వుంటుంది.

ఫిబ్రవరి : నూతన వ్యాపారాలకు, పెట్టుబడులకు చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. విందువినోదాల కోసం అధిక ఖర్చు వెచ్చిస్తారు. విద్యార్థులు అధిక శ్రమ, కృషి చేస్తేనే విజయం సాధిస్తారు. ధనధాన్య వస్తులాభం.

మార్చి : ప్రభుత్వం సంబంధ వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. ఆశాజనకంగా కనిపించిన ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి ఆధారిత వ్యక్తులకు కష్టసమయం, కొద్దిపాటి చికాకులు తప్పవు. దైవ సందర్శనం చేస్తే శుభం కలుగుతుంది.

rashi
  • Mesha Raasi
  • Vrushaba Raasi
  • Midhuna Raasi
  • Karkaataka Raasi
  • Simha Raasi
  • Kanya Raasi
  • Tula Raasi
  • Vruschika Raasi
  • Dhanus Raasi
  • Makara Raasi
  • Kumbha Raasi
  • Meena Raasi
 

valuprma