టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) తన తాజా మోడల్ అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ను ఆవిష్కరించడంతో అత్యంత పోటీతత్వంతో కూడిన మిడ్-సైజ్ ఎస్యూవీ విభాగంలోకి ప్రవేశించింది. రాబోయే పండుగ సీజన్లో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్న ఈ మోడల్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి వాటితో పోటీపడనుంది. దేశవ్యాప్తంగా ఉన్న తమ డీలర్‌షిప్‌లలో అర్బన్ క్రూయిజర్ హైరైడర్ మోడల్ బుకింగ్‌లను ప్రారంభించినట్లు టయోటా తెలిపింది. హైరైడర్ నియో డ్రైవ్, సెల్ఫ్ ఛార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ పవర్ట్రెయిన్లతో కూడిన రెండు పవర్ట్రెయిన్లతో వస్తోంది.
నియో డ్రైవ్ గ్రేడ్ ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ (ఐఎస్జీ) టెక్నాలజీతో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తోంది. ఇది 75కేడబ్ల్యూ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. ఆల్-వీల్ డ్రైవ్ (ఏడబ్ల్యూడీ) అమర్చిన నియో డ్రైవ్ ట్రిమ్‌లు 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లను కూడా కలిగి ఉంటాయి. ‘కార్బన్ న్యూట్రల్ సొసైటీని సాకారం చేయాలనే దృక్పథంతో పరిశుభ్రమైన, పచ్చటి భవిష్యత్తును సృష్టించే బాధ్యతను సమిష్టిగా కలిగి ఉండాలని మేం విశ్వసిస్తున్నాం. ఈ లక్ష్యాలకు అనుగుణంగా 'మేక్ ఇన్ ఇండియా', 'మాస్ ఎలక్ట్రిఫికేషన్' కార్యక్రమాలకు గణనీయమైన ప్రోత్సాహాన్ని అందించి, తద్వారా 'ఆత్మనిర్భర్ భారత్'కు మరింత ఊపును అందించేందుకు అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ను పరిచయం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది..’ అని టయోటా వైస్ ఛైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్ ఇక్కడ మోడల్‌ను ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో టీకేఎం మేనేజింగ్ డైరెక్టర్ మసకాజు యోషిమురా మాట్లాడుతూ 20 లక్షలకు పైగా సంతృప్తి చెందిన కస్టమర్లతో కూడిన భారతదేశంలో కంపెనీ దృష్టి అధునాతన ఉత్పత్తుల పరిచయంపై ప్రధానంగా ఉంటుందని వివరించారు. ‘కార్బన్ న్యూట్రాలిటీని సాధించడం ఎల్లప్పుడూ మా ముందున్న అతిపెద్ద సవాలు. దీని కోసం కార్బన్‌కు వ్యతిరేకంగా పోరాడటానికి బహుళ సాంకేతిక మార్గాలు అవసరం. మా తాజా సమర్పణ ఆ దిశలో మరొక అడుగు’ అని ఆయన పేర్కొన్నారు. అర్బన్ క్రూయిజర్ హైరైడర్ టయోటా అధునాతన గ్రీన్ టెక్నాలజీని ప్రతిబింబించే సెల్ఫ్-చార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్‌ను అందిస్తుందని చెప్పారు. ‘సుజుకితో టయోటా కూటమిలో భాగంగా మొట్టమొదటిసారిగా ఈ మోడల్ కర్ణాటకలోని టీకేఎం ప్లాంట్‌లో తయారవుతోంది.
ఈ వాహనం ప్రపంచ స్థాయి మోటరింగ్ అనుభవాన్ని అందిస్తుందని మేం గట్టిగా నమ్ముతున్నాం..’ అని అన్నారు. అర్బన్ క్రూయిజర్ హైరైడర్ టయోటా మోడల్ కార్లను ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తామని యోషిమురా పేర్కొన్నారు. కాగా, ఈ అర్బన్ క్రూసర్ హైరడైర్ ఎస్‌యూవీలో పనోరమిక్ సన్‌రూఫ్, వైర్లెస్ ఛార్జర్, హెడ్స్ అప్ డిస్ప్లే, 360-డిగ్రీ కెమెరా, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు వంటి అనేక ఫీచర్లతో అర్బన్ క్రూయిజర్ హైరైడర్ టయోటా వస్తోంది. 55కి పైగా కనెక్ట్ అయి ఉన్న ఫీచర్లు దీనిలో ఉంటాయి.
(And get your daily news straight to your inbox)
Aug 09 | అధునాతన టెక్నాలజీతో అందరి మనస్సులను కొల్లగొడుతున్న ఐఫోన్.. అందరి ఊహాలకు అతీతంగా తన ఐఫోన్ 14 సిరీస్..ను ముందుగానే విడుదల చేసేందుకు రంగం సిద్దం చేసింది. ఔనా అంటూ ఆశ్చర్యపోతున్నారా.? కానీ ఇది నిజమని... Read more
Jul 19 | దేశీయ కరెన్సీ రూపాయి డాలరు మారకంలో మరోసారి పాతాళానికి పడిపోయింది. డాలరుతో పోలిస్తే తొలిసారి 80కి చేరుకుంది. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో 79.9863 వద్ద ప్రారంభమై తర్వాత యుఎస్ డాలర్‌తో రూపాయి ఆల్ టైమ్... Read more
May 28 | భారత్‌లో వచ్చే ఏడాది ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు 10 శాతానికి పైగా పెంచుకోవాలని జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ `బీఎండబ్ల్యూ` లక్ష్యంగా పెట్టుకున్నది. ఆల్ ఎలక్ట్రిక్ సెడాన్ ఐ4ను భారత్‌లో ఆవిష్కరించింది. వాహనాల... Read more
Apr 27 | నోకియా ఫోన్ల తయారీదారు హెచ్ఎండీ గ్లోబల్ తాజాగా నోకియా జీ 21 ('Nokia G21') పేరుతో ఓ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే ఈ స్మార్ట్‌ఫోన్... Read more
Apr 22 | పెట్రోలు ధరలు సామాన్యులనే కాదు సంపన్నులను ఇబ్బంది పెడుతున్నాయి. రెండేళ్లలో లీటరు పెట్రోలు ధర రమారమి రూ.50 వంతున పెరిగింది. దీంతో పెట్రోలు వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు జనాలు మళ్లుతున్నారు. ఈ... Read more