Honda to launch flex- fuel motorcycle in India పెట్రోల్‌ ధరలకు చెక్ పెట్టనున్న హోండా ఫ్లెక్స్‌ ఇంజన్‌ బైక్‌

Honda displays xre300 rally titan cg flex fuel bikes in india

Honda India, HMSI, Honda Flex Fuel Bike, Honda Electric Scooter, Honda, Scooter, Electric,Honda India, HMSI, Honda Flex Fuel Bike, Honda Electric Scooter, Honda,Honda bikes,Honda flex fuel bikes,Honda XRE 300 Rally,Honda Titan,Honda Titan CG a, Technology, Auto Industry

Honda Motorcycle and Scooter India (HMSI), said that it is working on a flex-fuel commuter motorcycle, which will be launched in the country soon. The company may launch one or more commuter bikes in India with flex-fuel engines, which will be able to run on petrol and ethanol. HMSI also said they will launch multiple electric two-wheelers in India.

పెట్రోల్‌ ధరలకు చెక్ పెట్టనున్న హోండా ఫ్లెక్స్‌ ఇంజన్‌ బైక్‌

Posted: 04/22/2022 09:29 PM IST
Honda displays xre300 rally titan cg flex fuel bikes in india

పెట్రోలు ధరలు సామాన్యులనే కాదు సంపన్నులను ఇబ్బంది పెడుతున్నాయి. రెండేళ్లలో లీటరు పెట్రోలు ధర రమారమి రూ.50 వంతున పెరిగింది. దీంతో పెట్రోలు వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ వైపు జనాలు మళ్లుతున్నారు. ఈ తరుణంలో మరో ఐడియాతో వచ్చింది హోండా మోటర్‌ సైకిల్స్‌ అండ్‌ స్కూటర్స్‌ ఇండియా సంస్థ. పెట్రోలుతో పాటు ఇథనాల్‌తో నడిచే ఫ్లెక్స్‌ ఇంజన్‌ను ఉపయోగిస్తూ బైక్‌ను ఇండియా మార్కెట్‌లో ప్రవేశపెట్టబోతున్నట్టు హోండా ప్రకటించింది.

హోండా త్వరలోనే మార్కెట్‌లోకి తీసుకువచ్చే ఫ్లెక్స్‌ ఇంజన్‌ స్కూటర్‌ ఇటు పెట్రోలుతో పాటు అటు ఇథనాల్‌ ఇంధనంతో కూడా నడుస్తుంది. హోండా సంస్థ 2009లోనే టైటాన్‌ సీజీ ఫ్లెక్స్‌ పేరుతో ఓ బైకు విదేశీ మార్కెట్‌లో రిలీజ్‌ చేసింది. అయితే అప్పుడు పెట్రోలు ధరలు అదుపులోనే ఉండటంతో అంతగా క్లిక్‌ కాలేదు. ఇండియాలో సాగు రంగంలో చెరుకు బాగా ఉత్పత్తి అవుతోంది. చెరుకు పంట నుంచి బై ప్రోడక్టుగా భారీ ఎత్తున ఇథనాల్‌ తయారు చేసే అవకాశం ఉంది. దీంతో ఇటు రైతులకు ఉపయోగకరంగా ఉండటంతో పాటు పెట్రోలు నుంచి ఉపశమనం కలిగనుంది.

దీంతో ఫ్లెక్స్‌ ఇంజన్లతో కూడిన వాహనాలు తయారు చేయాలంటూ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కారీ ఇప్పటికే అనేక సంస్థలకు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే టీవీఎస్‌ సంస్థ ఫ్లెక్స్‌ ఇంజన్‌తో అపాచీ ఆర్టీఆర్‌ 200 ఎఫ్‌ఐ ఈ100 బైకును మార్కెట్‌లోకి తెచ్చింది. ఆ తర్వాత హోండా సంస్థ నుంచి మరో బైక్‌ మార్కె‍ట్‌లోకి రాబోతుంది. లీటరు పెట్రోలు ధరతో పోల్చినప్పుడు సగం ధరకే ఇథనాల్‌ లభిస్తుంది. అంతేకాక రైతులకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles