MG ZS EV unveiled in India, launch in January 2020 దేశీయ విపణిలోకి ఎంజీ జెట్ ఎస్ ఈబీ ఎలక్ట్రికల్ ఎస్యూవీ

Mg zs ev debuts in india ahead of january 2020 launch

MG ZS EV, MG ZS electric vehicle, MG ZS EV unveil, MG ZS EV price, MG ZS EV features, MG ZS EV launch, MG ZS EV battery, MG ZS EV range, MG ZS EV top speed, MG ZS EV specifications,Business, Technology

After the Hector, the ZS electric vehicle will be the second offering of Morris Garages in India. While MG Hector has been liked by masses across the country, the carmaker will be hoping for a similar response for the upcoming ZS.

దేశీయ విపణిలోకి ఎంజీ జెట్ ఎస్ ఈబీ ఎలక్ట్రికల్ ఎస్యూవీ

Posted: 12/05/2019 10:36 PM IST
Mg zs ev debuts in india ahead of january 2020 launch

హెక్టర్‌ మోడల్ తో దేశీయ విఫణిలోకి ప్రవేశించిన మోటార్ కార్ల అభిమానుల ఆకట్టుకున్న ఎంజీ మోటార్స్‌ ఈసారి విద్యుత్తు కారును విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఎంజీ జెడ్‌ఎస్‌ ఈవి పేరుతో దీనిని భారతీయ మార్కెట్ లోకి తీసుకురానుంది. ఈ కంపెనీ నుంచి భారత మార్కెట్లోకి వస్తున్న తొలి విద్యుత్తు ఎస్‌యూవీ ఇదే. ఇప్పటికే యుకేలో విక్రయిస్తున్న మోడల్‌ కారునే భారత్‌కు కూడా తీసుకొచ్చింది. కాకపోతే దీనికి సంబంధించిన అసెంబ్లింగ్‌ మాత్రం గుజరాత్ లోని హలోల్‌ ప్లాంట్ లో జరుగుతుంది. ఈ కారు హ్యూందాయ్‌ కోనా విద్యుత్తు కారుకు బలమైన పోటీ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. దీని ధరను జనవరి 2020లో వెల్లడిస్తామని ఎంజీ మోటార్స్‌ వెల్లడించింది.

జెడ్‌ఎస్‌ ఈవి ఇంటీరియర్‌ ఇలా:
డ్యాష్‌బోర్డును చాలా సింపుల్ గా ఎక్కువ స్విచ్‌లు, బటన్లు లేకుండా తయారు చేసింది.
8 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్ కు యాపిల్‌ కార్ ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటో సౌకర్యాలు అటాచ్ చేసింది.
యూఎస్‌బీ మొబైల్‌ ఛార్జింగ్‌ సౌకర్యాన్ని  ముందు, వెనుక వరసల్లో పొందుపర్చింది
అన్నికార్లకు సన్‌రూఫ్ ను సౌకర్యాన్ని కల్పించింది.
ఐస్మార్ట్‌ 2.0 కనెక్టడ్‌ కార్‌ టెక్నాలజీని అందించింది.
ఈ కారు క్యాబిన్ లోకి వచ్చే గాలిని కూడా శుద్ది చేసేలా పీఎం 2.5 ఎయిర్‌ ఫిల్టర్లను ఇచ్చారు.
ఈ కారులో 44.5 కిలోవాట్స్‌ అవర్స్‌ శక్తి ఉన్న బ్యాటరీని వుంది.
ఒక సారి రీఛార్జి చేస్తే 340 కిలోమీటర్లు వెళ్లే అవకాశం ఉంది.
దీనిలోని లిథియం అయాన్‌ బ్యాటరీ 40 నిమిషాల్లో 80శాతం ఛార్జింగ్‌ చేసుకోవచ్చు.
దీనిలో సిక్రోనస్‌ మోటార్‌ 141 బీహెచ్‌పీ శక్తిని, 353 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది.
కేవలం 8క్షణాల్లో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles