Gold crosses Rs 37000 may go up further ప్రపంచవ్యాప్తంగా పసిడి ధరకు రెక్కలు.. అదేబాటలో వెండి

Gold surges to record high nears rs 37 000 silver up rs 1 000

Gold prices, safe haven, silver, SMC Global Securities, SPDR, Precious metal, Gold, silver, price, international market, oil trade, global trend, US Federal Bank, Bullien Market, Business

The gold rate went up by Rs. 800 per 10 grams on the back of strong global trend as trade tensions between the United States and China escalated.

ప్రపంచవ్యాప్తంగా పసిడి ధరకు రెక్కలు.. అదేబాటలో వెండి

Posted: 08/07/2019 01:26 PM IST
Gold surges to record high nears rs 37 000 silver up rs 1 000

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి దర పైపైకి వెళ్తోంది. గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న పరిణామాలతో బంగారం ధరకు రెక్కలు వచ్చాయి. క్రూడాయిల్ ధరలు తగ్గుతూ ఉండటంతో ఇన్వెస్టర్లు బులియన్ మార్కెట్ వైపుకు మొగ్గుచూపుతున్నారు. ఇదే సమయంలో యూఎస్ లో ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను తగ్గించిన తరువాత పెట్టుబడిదారులు తమ వద్ద ఉన్న ఈక్విటీల అమ్మకాలవైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డు ధరకు చేరాయి.

అంతర్జాతీయంగా కుందనానికి మంచి డిమాండ్ ఉండటంతో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. షేర్ మార్కెట్ కన్నా బంగారంపై పెట్టుబడులకే ప్రపంచవ్యాప్తంగా మదుపరులు మొగ్గుచూపుతున్నారు. వీటి ఫలితంగా భారత మార్కెట్లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 800 పెరిగి రూ. 36,970కి చేరింది. ఇదే సమయంలో వెండి ధర కిలోకు రూ. 1000 పెరిగి రూ. 43,100కు చేరుకుంది.

డాలర్ తో రూపాయి మారకపు విలువ బలహీనపడటం కూడా బంగారం ధరను పెంచిందని బులియన్ పండితులు వ్యాఖ్యానించారు.ఇక ఎంసీఎక్స్ (మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్)లో ఫ్యూచర్స్ మార్కెట్ విషయానికి వస్తే, బంగారం, వెండి ధరలు 2 శాతం పెరిగి (అక్టోబర్ డెలివరీ) వరుసగా రూ. 36,977, రూ. 42,439కి చేరాయి. గ్లోబల్ మార్కెట్లలో సైతం బంగారం ధర ఆరేళ్ల గరిష్ఠ స్థాయికి చేరి, ఔన్సు బంగారం ధర 1,459 డాలర్లకు చేరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gold  silver  price  international market  oil trade  global trend  US Federal Bank  Bullien Market  Business  

Other Articles