భారతీయులు సరికొత్త అలోచనా ధోరణలకు సృజనాత్మకతకు తగినట్టుగా నూతన సాంకేతికతో ఇమిడివున్న టీవీలకు అధికంగా అకర్షితులు అవుతున్నారు. స్మార్ టీవీలు, హెచ్ డి టీవీలు తరువాత టీవీల ఉత్పత్తిలో వేగంగా వస్తున్న విప్లవాత్మక మార్పుల నేపథ్యంలో తాజా ట్రెండ్ ను అనుసరించి ఆండ్రాయిడ్, అమోల్డ్ టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో భారతీయుల మనసు తెలిసిన దక్షిణ కొరియా కంపెనీ... శాంసంగ్ సరికొత్త టీవీని అవిష్కరించనుంది.
వచ్చే వారం ఇండియాలో లాంచ్ చెయ్యబోతున్న సరికొత్త 4K UHD TV రేటు రూ.60,000 ఉండబోతోంది. మార్చి రెండో వారం నుంచీ ఇది ఆన్లైన్లో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇండియాలో 4K UHD TVల సిరీస్ తెస్తున్న శాంసంగ్... వీటి ప్రారంభ ధర రూ.40,000 నుంచీ మొదలవుతుందని వివరించింది. ఆన్లైన్ ఫోకస్‌గా వస్తున్న ఈ మోడల్స్‌లో చాలా ఎక్కువ స్మార్ట్ ఫీచర్లను ఇన్‌బిల్ట్ చేస్తున్నారు. ప్రధానంగా లైవ్ కాస్ట్, మ్యూజిక్ ప్లేయర్స్, లాగ్ ఫ్రీ గేమింగ్ వంటి ఫీచర్లు ఉండబోతున్నాయి.
ఈ సిరీస్ టీవీలు... 43 ఇంచెస్, 50 ఇంచెస్, 55 ఇంచెస్ స్క్రీన్ సైజుల్లో లభించబోతున్నాయి. శాంసంగ్ తెస్తున్న UHD సిరీస్‌లో 2018 జూన్‌లో రిలీజ్ చేసిన రూ.64,900 ధర పలికిన 7100, 7470, 8000 series మోడల్స్ కూడా ఉండబోతున్నాయి. మొత్తంగా బ్రాండెడ్ మొబైళ్లు, స్మార్ట్ వాచీలు, స్మార్ట్ ల్యాప్‌టాప్‌లూ తెచ్చిన శాంసంగ్... 4K టీవీలతో ఇండియా మార్కెట్లో తన షేర్‌ను మరింత పెంచుకోవాలని చూస్తోంది.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more