OnePlus 6T comes to India భారతీయ విఫణీలోకి వన్ ప్లస్ 6టి..

Oneplus 6t with in display fingerprint scanner and a smaller notch

6t, oneplus, OnePlus 6, OnePlus 6T, oneplus 6t 2018, oneplus 6t camera, oneplus 6t features, oneplus 6t first look, oneplus 6t hands on, oneplus 6t india, oneplus 6t leaks, oneplus 6t official, oneplus 6t official video, oneplus 6t price, OnePlus 6T Price India, oneplus 6t release date, oneplus 6t review, oneplus 6t specs, oneplus 6t speed test, oneplus 6t unboxing, oneplus 6t vs, oneplus 6t vs iphone xs max, oneplus 6t vs oneplus 6, smart phones, mobiles, technology, business

OnePlus 6T be available in midnight black and mirror black colours in 8GM RAM + 128GB storage and 8GB RAM + 256GB storage variants for Rs 41,999 and Rs 45,999, respectively.

భారతీయ విఫణీలోకి వన్ ప్లస్ 6టి.. లాంచింగ్ ఆపర్లు కూడా..

Posted: 10/31/2018 07:10 PM IST
Oneplus 6t with in display fingerprint scanner and a smaller notch

ప్రముఖ చైనా మోబైల్ ఫోన్ల సంస్థ 'వన్‌ప్లస్‌' సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో ఆవిష్కరించింది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో 'వన్‌ప్లస్‌ 6టీ' స్మార్ట్ ఫోన్ ను  లాంచ్ చేసింది. గతేడాది మేలో తీసుకొచ్చిన వన్ ప్లస్‌ 6కి కొనసాగింపుగా దీన్ని తీసుకొచ్చింది. లాంచింగ్‌ కార్యక్రమాన్ని వన్ ప్లస్ ఇండియా, యూట్యూట్, అమెజాన్ ఇండియా వెబ్ సైట్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. 6/8 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఈ కొత్త స్మార్ట్ ఫోన్లు రానున్నాయి. స్క్రీన్ ముందుభాగంలో ఫింగ్ ప్రింట్ సెన్సార్ తో రావడం ఈ ఫోన్ విశేషం.

ధరలు ఇలా..
ఈ ఫోన్ ధరల విషయానికొస్తే.. 6 జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధర సుమారు రూ.37,999; 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధరను రూ. 41,999; 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధరను సుమారు రూ.45,999 గా నిర్ణయించారు. నవంబరు 1 అర్ధరాత్రి నుంచి వినియోగదారులకు ఈ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. అమెజాన్ వెబ్ సైట్ తోపాటు, వన్ ప్లస్ ఆఫ్ లైన్ స్టోర్లలోనూ ఈ ఫోన్లు లభ్యం కానున్నాయి. వన్ ప్లస్ 6 టీ రాకతో అమెజాన్ వెబ్ సైట్లో 'వన్ ప్లస్ 6' అమ్మకాలను నిలిపివేశారు. నవంబరు 3న ఓపెన్ సేల్ లో ఈ ఫోన్లను విక్రయించనున్నారు.

ఫీచర్లు :

* డిస్‌ప్లే: 6.4 అంగుళాలు
* స్క్రీన్ రిజల్యూషన్: 2340 x 1080 మెగా పిక్సెల్ , గోరిల్లా గ్లాస్ 6.
* ప్రాసెసర్: క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్
* ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9.0 పై ఓఎస్
* ర్యామ్: 6/8 జీబీ
* స్టోరేజ్: 128/256 జీబీ
* కెమెరా: 16 మెగా 16 + 20 మెగాపిక్సెల్
* బ్లూటూత్ 5.0
* వైఫై 802.11
* బ్యాటరీ: 3700 ఎంఏహెఎచ్

లాంచింగ్ ఆఫర్లు:

* రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో కొనుగోలుపై రూ.5,400 క్యాష్ బ్యాక్‌, 3 టీబీ 4జీ డేటా లభ్యం
* ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్/ డెబిట్, సిటి బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలుపై రూ.2000 క్యాష్ బ్యాక్.
* అమెజాన్ పే ద్వారా ప్రీ ఆర్డర్ బుకింగ్ పై రూ.500 సత్వర క్యాష్ బ్యాక్.
* వినియోగదారులకు అందుబాటులో నోకాస్ట్ ఈఎంఐ, ఫ్రీ డ్యామేజ్ ప్రొటెక్షన్ ఆప్షన్లు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : one plus  one plus 6T  e-commerce  smart phones  mobiles  technology  business  

Other Articles