రిలయన్స్ జియో తీసుకువచ్చిన ఫీచర్ ఫోన్ కు పోటీగా ఇప్పటికే ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్ సహా మరెన్నో టెలికాం సంస్థలు ఇప్పటికే స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కాగా తాజాగా వొడాఫోన్ కూడా ఈ పోటీలో చేరిపోయింది, ఐటెల్ భాగస్వామ్యంలో కొత్తగా ఓ 4జీ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఏ20 పేరుతో ఎంట్రీ లెవల్ సెగ్మెంట్ లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. రూ.3,690 డౌన్‌పేమెంట్‌లో అందుబాటులో ఉండే ఈ స్మార్ట్ ఫోన్ పై రూ.2100 క్యాష్ బ్యాక్ ను వొడాఫోన్ ఆఫర్ చేస్తోంది.
అంటే కేవలం రూ.1,590కే ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ కింద వినియోగదారులు 4జీ కనెక్టివిటీని కూడా పొందవచ్చు. అయితే క్యాష్ బ్యాక్ ను పొందడానికి ఏ20 స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారులు వరుసగా 18 నెలల పాటు రూ.150 లేదా ఆపై మొత్తాలతో రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా రీఛార్జ్‌లు చేయించుకుంటే, ఏడాదిన్నర తర్వాత రూ.900, ఆ తర్వాత ఏడాదిన్నరకు రూ.1200ను క్యాష్ బ్యాక్ గా అందిస్తుంది. యూజర్లు ఈ క్యాష్ బ్యాక్ మొత్తాన్ని ఎం-పైసా వాలెట్లలో పొందుతారని వొడాఫోన్ పేర్కొంది.
వొడ ఫోన్ -ఇంటెల్ ఏ20 స్మార్ట్ ఫోన్ ఫీచర్లు...
4జీ వాయిస్ఓవర్ ఎల్టీఈ
ఆండ్రాయిడ్ 7.0 నోగట్
1జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నల్ మెమరీ
1.3గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్
1500 ఎంఏహెచ్ బ్యాటరీ
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more