భారతీయ విఫణిలో శరవేగంగా దూసుకెళ్తున్న చౌకధర స్మార్ట్ ఫోన్ అమ్మకాలను అందుకునేందుకు, చైనాకు చెందిన రెడ్ ఎంఐ ఫోన్లకు పోటీగా రంగంలోకి దిగింది నోకియా. నోకియా స్మార్ట్ ఫోన్లను తయారు చేసేందుకు సర్వహక్కులను పోందిన హెచ్ఎండీ గ్లోబల్ చౌకధరలో భారీ బ్యాటరీ కలిగిన 4జీ స్మార్ట్ ఫోన్ ను ఇవాళ అంతర్జాతీయ విఫణిలోకి ప్రవేశపెట్టింది. దేశరాజధాని ఢిల్లీ వేదికగా నోకియా 2 స్మార్ట్ ఫోన్ ను నోకియా విడుదల చేసింది.
అయితే దీని ధరను 99 యూరోలుగా కంపెనీ పేర్కొంది. అంటే దేశీయ కరెన్సీ ప్రకారం సుమారు 7,500 రూపాయలు. నవంబర్ మధ్య నుంచి ఈ 4జీ ఫోన్ అమ్మకాలు ప్రారంభమవుతాయని ప్రారంభ వేదిక పైనుంచి కంపెనీ ప్రకటించింది. హెచ్ఎండీ గ్లోబల్ ఇప్పటి వరకు విడుదల చేసిన నోకియా బ్రాండు స్మార్ట్ ఫోన్లలో నోకియా 2 మాత్రమే అత్యంత చౌక ధర ఫోన్. దీంతో షావోమి రెడ్ ఎంఐ సహా మోటో సీ స్మార్ట్ ఫోన్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నోకియా 2 స్పెసిఫికేషన్స్:-
5 అంగుళాల ఎల్టీపీఎస్ హెచ్డీ స్క్రీన్, గొర్రిల్లా గ్లాస్
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 212 ప్రాసెసర్
1 జీబీ ర్యామ్
8 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్
128 జీబీ వరకు విస్తరణ మెమరీ
8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
4జీ ఎల్టీఈ ఫోన్
ఆండ్రాయిడ్ 7.1 నోగట్, త్వరలోనే ఓరియో అప్ డేట్
కాపర్ బ్లాక్, క్లియర్ బ్లాక, క్లియర్ వైట్ వర్ణాలలో లభ్యం
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more