Xiaomi Mi Max 2 launched in China బడ్జట్ ధరల్లో.. ఎంఐ మాక్స్ 2 లాంచ్ చేసిన షియోమీ..

Xiaomi s new mi max 2 smartphone claims a two day battery

xiaomi, xiaomi mi max 2, mi max 2 price, mi max 2 vs mi max, mi max 2 specs, mi max 2 price in india, mi max 2 china, mi max 2 india launch date, mi max 2 features, mobiles, smartphones, technology

Xiaomi Mi Max 2 smartphone has now officially been launced by the company. Mi Max 2 users now get extra RAM and storage, more battery life, and a better camera.

బడ్జట్ ధరల్లో.. ఎంఐ మాక్స్ 2 లాంచ్ చేసిన షియోమీ..

Posted: 05/25/2017 07:56 PM IST
Xiaomi s new mi max 2 smartphone claims a two day battery

స్మార్ట్ ఫోన్ ప్రియులను అకర్షించేందుకు భారతీయ విఫణిలోకి మరో కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. బడ్జెట్‌ ధరల్లోనే అధునిక ఫీచర్స్ తో ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఈ ఫోన్ ను చైనీస్ మార్కెట్ లోకి ఇవాళ విడుదల చేసింది చైనా మొబైల్‌ మేకర్‌ షియోమి. పెద్ద డిస్ ప్లే.. పెద్ద బ్యాటరీ అన్న ట్యాగ్ తో కూడా స్మార్ట్ ఫోన్ లవర్స్ ను తనవైపు లాగేస్తుంది. ఇవాళ ఎంఐ మాక్స్‌ 2 ఫ్లాబ్లెట్ ను  చైనా మార్కెట్లో ప్రవేశపెట్టింది.  అదీ సరసమైన ధరకే. మి మాక్స్‌ కు సక్సెసర్‌గా  అంచనాలకు తగ్గట్టుగా వుంది.

భారీ స్క్రీన్  పెద్ద బ్యాటరీ లాంటి అదిరిపోయే ఫీచర్లతో ఎంఐ మ్యాక్స్ 2ను విడుదల చేసింది. రెండు స్టోరేజ్ వేరియంట్లలో (64 జీబీ, 128 జీబీ) లభ్యంకానుంది. ఈ హ్యాండ్‌ సైట్‌ వెనుకవైపు ఫింగర్ ప్రింట్ స్కానర్‌ అమర్చింది. అలాగే  ఐఆర్‌ బ్లాస్టర్ (టీవీలకు, ఏసీలకు రిమోట్‌గా వాడుకునేలా) ను పొందుపర్చింది. స్టీరియో స్పీకర్లను అమర్చడం అతిపెద్ద ఇంప్రూవ్‌మెంట్‌గా కంపెనీ చెబుతోంది. 64 జీబీ వేరియంట్‌ D  1,699  యెన్‌లు (సుమారు రూ. 16,000) 128జీబీ వేరియంట్‌ 1,999 యెన్‌లు (సుమారు రూ.19,000) ధరలుగా నిర్ణయించింది. జూన్‌ 1 నుంచి  చైనాలో విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

ఎంఐ  మాక్స్‌ 2 ఫీచర్స్‌
ఆండ్రాయిడ్‌ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టమ్‌
6.44 అంగుళాల ఫుల్‌ హెచ్‌ డీ డిస్‌ప్లే
1920x1080 పిక్సెల్‌ రిజల్యూషన్‌
4 జీబీ  ర్యామ్‌
64జీబీ/128 జీబీ  ఇంటర్నెనల్‌ స్టోరేజ్‌
మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా విస్తరించుకునే సదుపాయం వుంది
12ఎంపీ రియర్‌ కెమెరా
5ఎంపీ ఫ్రంట్‌ కెమెరా సెల్ఫీ షూటర్‌
5300 ఎంఏహెచ్‌  బ్యాటరీ  సామర్థ్యం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Xiaomi  Mi Max 2  chinese market  big display  5300mAh battery  technology  

Other Articles