డేటా పరమితిని తగ్గించిన జియో.. అది కూడా గుడ్ న్యూసేనట reliance jio limits free data from 4 to 1gb per day

Reliance jio limits free data from 4 to 1gb per day

jio happy new offer, reliance jio happy new offer, jio 1gb limit, news, reliance jio, personal technology, mobile, gadgets

Reliance Jio free welcome offer was about to expire in December end. As the date nears, the company has announced yet another program with the extension to existing subscribers.

డేటా పరమితిని తగ్గించిన జియో.. అది కూడా గుడ్ న్యూసేనట

Posted: 12/03/2016 08:27 PM IST
Reliance jio limits free data from 4 to 1gb per day

జియోపై వినియోగదారులకు అందిస్తున్న ఉచిత సేవలన్నింటిన్నీ వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించిన రిలయన్స్ జియో తమ కస్టమర్లకు మరో శుభవార్తను కూడా అందించింది. హ్యాపీ న్యూయర్ ఆఫర్ కింద ఉచిత సేవలను వినియోగించుకోవచ్చని చెబుతూనే.. ప్రస్తుతం డేటాపై అందిస్తున్న రోజుకు 4జీబీ పరిమితిని 1జీబీకి కుదించారు. ఇది కూడా వినియోగదారులకు గుడ్న్యూసేనట. ఎలాగా అని లోచనలో పడ్డారా..?

జియో డేటా వాడకంపై లోడ్ తగ్గి, మంచి 4జీ అనుభవాన్ని వినియోగదారులు పొందవచ్చట. పరిమితిని తగ్గించడంతో జియో స్పీడ్ను మెరుగుపరుచుకోవచ్చు. జియో డేటా పరిమితిని తగ్గించడంతో తను చేధించదలుచుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుందని, మార్చి చివరి వరకు 100 మిలియన్ యూజర్లను సొంతం చేసుకుంటుందని అంచనా వేస్తున్నారు. నెట్వర్క్ వినియోగాన్ని తగ్గించి, మంచి క్వాలిటీ సర్వీసులను వినియోగదారులకు అందించాలని, దీంతో ఉచిత ఆఫర్ ముగిసినా ఈ సిమ్పైనే యూజర్లు కొనసాగుతారని కంపెనీ వర్గాలు భావిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles