మరో సంచలనానికి తెరతీస్తున్నరిలయన్స్ జియో.. Reliance Jio To Launch Cheapest 4G Smartphones

Reliance jio to launch cheapest 4g smartphones

Jio Broadband services, Jio fiber optic cables, Jio FTTH, Jio Mediashare, Jio TV, Reliance Jio, Reliance Jio internet, reliance, jio, smartphones, mobiles, 4g, news, reliance jio cheapest smartphone, cheapest 4g smartphone, new lyf phones, india

Reliance has been making efforts in the direction for long and laying down fiber optic cable across many part of the countries. With the FTTH services, Reliance aims to deliver 1 Gbps broadband internet in India.

ఫ్రీడమ్ తరహాలో మరో సంచలనానికి తెరతీస్తున్నరిలయన్స్ జియో..

Posted: 11/14/2016 06:00 PM IST
Reliance jio to launch cheapest 4g smartphones

జియో​ 4జీ మొబైల్‌ సర్వీసులతో భారత టెలికం ఇండస్ట్రీ రంగంలో ఉచిత కాల్స్, ఉచిత డేటాతో ఒక్కసారిగా పోటీదారులకు కుదుపేసిన రిలయన్స్‌ మరో సంచలనానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఇటు డీటీహెచ్‌, బ్రాడ్‌ బ్రాండ్‌ సేవల్లోనూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టేందుకు కసరత్తులు చేస్తూనే.. అటు రిగింగ్ బెల్స్ ప్రకటించిన ఫ్రీడమ్ ఫోన్ తరహాలో సరికోత్త 4జీ ఫోన్లను అత్యంత చౌకైన ధరకు అందించేందుకు కూడా ప్రయత్నాలు ప్రారంభించింది. వచ్చే ఏడాది కేవలం వెయ్యి రూపాయలకే అన్ని ఫీచర్లు వున్న 4జీ ఫోన్ ను అందించాలని నిర్ణయించింది.

ఈ మేరకు సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనలు లేకున్నా.. సంస్థ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు ఈ విషయాలు తెలిసాయి. జియో టీవీతో ప్రస్తుతం ఉన్న డీటీహెచ్‌, బ్రాడ్‌ బ్రాండ్‌ కంపెనీలకు షాక్‌ ఇవ్వనుంది. హైస్పీడ్‌ ఆప్టికల్‌ ఫైబర్‌ తో ఒక జీబీపీస్‌ వరకు ఇంటర్నెట్‌ అందించేందుకు సన్నాహాలు మొదలు పెట్టింది. ఇప్పటికే దేశంలో చాలాచోట్ల కేబుల్స్ వేసింది. పైలట్‌ ప్రాజెక్టుగా ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో డీటీహెచ్‌, బ్రాడ్‌ బ్రాండ్‌ సేవలను రిలయన్స్‌ అందిస్తోంది.

అయితే ఈ సేవలను  పూర్తిగా ఉచితంగా అందిస్తోందా, లేదా అనేది వెల్లడికాలేదు. డీటీహెచ్‌, బ్రాడ్‌ బ్రాండ్‌ సేవలు వినియోగించుకునే కస్టమర్లకు జియో సేవలు కూడా అందించాలని రిలయన్స్‌ యోచిస్తోంది. వీటికి సంబంధించిన సెట్‌ అప్‌ బ్యాక్స్‌, ఆండ్రాయిడ్‌ స్మార్ట్ బాక్స్‌ అందించి నిరాంతరాయంగా హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ కల్పించాలని సన్నాహాలు చేస్తోంది. ఈ సేవలు అందుబాటులోకి వస్తే వినియోగదారులు ఎటువంటి అంతరాయం లేకుండా 4కే వీడియోలు వీక్షించే అవకాశం కలుగుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles