లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. 8700మార్కుకు దిగువన నిఫ్టీ Sensex rallies 200 points; Nifty below 8700 level

Sensex rallies 200 points nifty below 8700 level

Sensex, sensex bse, sensex today, sensex today india, sensex today closing, sensex share price, sensex shares, sensex gainer and losers, sensex graph, nifty, nifty top gainers, nifty top 50, bse sensex, bse nse, global markets, Asian markets, BSE, NSE, Hillary Clinton, Donald Trump, Hillary Clinton Donald Trum US Presidential Debate

BSE Sensex and NSE Nifty climbed nearly 0.50 per cent following positive cues from the global markets, as strong US earnings and rally in oil prices helped spur global risk appetite.

లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. 8700మార్కుకు దిగువన నిఫ్టీ

Posted: 10/20/2016 06:25 PM IST
Sensex rallies 200 points nifty below 8700 level

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ముగిశాయి. విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాల నేపథ్యంలో మార్కెట్లు గత రెండు రోజుల వరస నష్టాలకు బ్రేకులు పడటంతో పాటు లాభాల్లోకి తూసుకెళ్లాయి. ఆరంభంలో లాభాలతో ఆకట్టుకుని 200 పాయింట్లకు పైగా ఎగిసినా లాభాలను అధిమపట్టుకోవడంలో విఫలమైన మార్కెట్లు కొంత మేర లాభాలను గడించాయి. ఈ క్రమంలో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 145 పాయింట్ల లాభాలకు, నిఫ్టీ 40 పాయింట్ల లాభాలకు సరిపెట్టుకుంది.

విదేశీ సానుకూల పవనాలకు తోడు అంతర్జాతీయ మార్కెట్లలో అయిల్ అండ్ గ్యాస్ ధరలు ర్యాలీ కోనసాగడంతో.. మార్కెట్లు లాభాలను గడించాయి.  దీనికి తోడు అమెరికా అధ్యక్ష ఎన్నికలలో భాగంగా రేసులోని అభ్యర్థుల మధ్య సాగిన ఫైనల్ డిబేట్ లోనూ హిల్లరిదే పైచేయి అని తేలడం.. ఇక నవంబర్ 8న జరిగే తుదిపోరులో అమె ఎన్నిక లాంఛనమే అని స్పష్టం కావడంతో అమెరికా మార్కట్ల నుంచి వచ్చిన పాజిటివ్ క్యూలు కూడా లాభాలకు దోహదపడ్డాయి.

కాగా మద్యాహ్నం సెషన్ నుంచి ముఖ్యంగా ఐటీ, ఎఫ్ ఎంసీజీ, ఫార్మా సెక్టార్ ల బలహీనత మార్కెట్ ను ప్రభావితం చేసి లాభాలను హరించేలా చేసింది. దీనికి తోడు భారీ ఎత్తున ఏటీఎం కార్డుల  సమాచారం లీక్  అయిన వివాదం కొనసాగుతున్నప్పటికీ బ్యాంకింగ్ సెక్టార్ లాభాలను ఆర్జించింది. అటు ప్రయివేట్ బ్యాంక్ ఎస్ బ్యాంక్ ప్రభుత్వ రంగ సంస్థ ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ క్యూ2 మెరుగైన ఫలితాలను ప్రకటించాయి. అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ, ఎస్ బీఐ, ఎల్ అండ్ టీ, టాప్  గెయినర్స్ గా , లుపిన్, హిందుస్తాన్ యూనీ లీ వర్, టాటా మోటార్స్, సన్ ఫార్మ,  టాఇన్ఫోసిస్, ఐటీసీ టాప్ లూజర్స్  గా నిలిచాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  nse  bse  stock market  global markets  business  

Other Articles