మార్కెట్లను ముంచెత్తిన అమ్మాకాల ఒత్తిడి.. నష్టాల్లో సూచీలు.. Nifty ends at 8709, Sensex down 115pts

Nifty ends at 8709 sensex down 115pts

sensex, nifty, indian share market, indian stock exchange, Tata Consultancy Services, infosys, sensex at a low, two year low of sensex, janet yellen, janet yellen united states reserve federal chairperson, united states federal reserve bank, united states federal reserve

GAIL, Reliance, HUL, ONGC and HDFC were top gainers while Cipla, NTPC, M&M, Infosys and ICICI Bank were losers in the Sensex.

మార్కెట్లను ముంచెత్తిన అమ్మాకాల ఒత్తిడి.. నష్టాల్లో సూచీలు..

Posted: 10/06/2016 06:05 PM IST
Nifty ends at 8709 sensex down 115pts

దేశీయ మార్కెట్లకు వరుసగా రెండో రోజు నష్టాలను ముంచెత్తాయి. వరుసగా రెండో రోజు మార్కెట్లకు మదుపరులు షాక్ ఇచ్చారు. ఉదయం లాభాల బాటలో పయనిస్తున్న మార్కెట్లను చూసి చూడాగానే మదుపరులు మరోమారు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో దేశీయ సూచీలు నష్టాలలో ముగిసాయి. అందర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాల నేపథ్యంలో మార్కెట్లు ప్రారంభంలో లాభాలలో పయనించాయి. అయితే మిడ్ సెషన్ నుంచి మదుపరులు అమ్మకాలతో దేశీయ సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి, ఒక దశలో సుమారు 200 పాయింట్లకు పైగానే సెన్సెక్స్ దిగజారింది,

ఈ క్రమంలో సెన్సెక్స్ 115 పాయింట్ల నష్టంతో 28,106 వద్ద ముగియగా, అటు నిప్టీ కూడా 34 పాయింట్ల నష్టంతో 8, 709 వద్ద ముగిశాయి. నిఫ్టీ కీలక మద్దతు స్టాయి 8700 మార్కు ఎగువన ముగిసింది. ధీంతో ఇవాళ మొత్తంగా 2101 సంస్థల షేర్లు ట్రేడింగ్ లో పాల్గోనగా, అందులో 1367 సంస్థల షేర్లు లాభాలను అర్జించగా, 1513 సంస్థలు షేర్లు నష్టాలను చవిచూశాయి, కాగా 132 సంస్థల షేర్లు తటస్థంగా నిలిచాయి.

 ఈ నేపథ్యంలో అయిల్ అండ్ గ్యాస్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, మెటల్స్ మినహా అన్ని సూచీలు నష్టాల బాటలోనే పయనించాయి. అటో, బ్యాంకింగ్, బ్యాంకింగ్ నిఫ్టీ, హెల్త్ కేర్, ఐటీ, టెక్నాలజీ, చిన్న తరహా, మద్య తరహా పరిశ్రమల సమాఖ్య, మధ్యతరహా పరిశ్రమల సమాఖ్య నిఫ్టీలతో పాటు క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంజీసీ సూచీలు కూడా నష్టాలను ఎదుర్కోన్నాయి, ఈ క్రమంలో గెయిల్, బిపిసిఎల్; గ్రాసిమ్, రిలయన్స్, హెచ్ యు ఎల్ తదితర సంస్థలు అత్యధిక లాభఆలను కురిపించగా,  బ్యాంక్ అప్ బరోడా, ఎన్టీపిసీ, సిప్లా, జీ ఎంటర్నైమెంట్, పవర్ గ్రిండ్ కార్పోరేషన్  తదితర సంస్థల షేర్లు క్షీణించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  indian share market  indian stock exchange  

Other Articles