Verizon confirms $4.83 billion buyout of Yahoo, marking end of an era

Verizon s purchase of yahoo explained

Verizon, Yahoo, $4.8 Billion, Warren Buffett, video, US, TechCrunch, portfolio, Microsoft, markets, Market, Marissa Mayer, Flickr, Microsoft, Verizon, Yahoo Chat, Yahoo Inc, Yahoo Mail, Yahoo!, Yahoo! Messenger

Internet pioneer Yahoo has finally sealed the deal to sell its core online assets, ending a 20-year run as an independent company. US telecom giant Verizon Communications has bought Yahoo's search and advertising operations today for $4.83 billion.

యాహూ.. ఇక కనుమరుగు.. వెరిజోన్ చేతికి పగ్గాలు..

Posted: 07/25/2016 08:08 PM IST
Verizon s purchase of yahoo explained

ఇంటర్ నెట్ తొలి రోజుల్లో అంతర్జాల ప్రపంచాన్ని ఏలిన సెర్చ్ ఇంజన్ దిగ్గజ సంస్థ యాహూ కనుమరుగుకానుంది. చానాళ్లుగా అర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న ఈ సంస్థను ప్రముఖ వైర్లెస్ దిగ్గజం వెరిజోన్ కొనుగోలు చేసింది. 4.83 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.32,491.41కోట్లు) యాహూ ఇంటర్నెట్ ఆస్తులను కొనుగోలు చేస్తున్నట్టు వెరిజోన్ ప్రకటించింది. ఈ కొనుగోలు డీల్ మొత్తం నగదు రూపంలో ఉండనుందని తెలిపింది. మొదటి నుంచి గట్టి పోటీదారుడిగా వచ్చిన వెరిజోన్ చివరికి యాహూను కైవసం చేసుకుంది.

యాహూ వ్యాపారాలను వెరిజోన్ కొనుగోలు చేయడం వల్ల, తన ఏఓఎల్ ఇంటర్నెట్ బిజినెస్లను వెరిజోన్ పెంచుకోనుంది. యాహూ అడ్వర్టైజింగ్ టెక్నాలజీ టూల్స్, సెర్చ్, మెయిల్, మెసెంజర్ లాంటి ఇతర ఆస్తులకు మాత్రమే ఈ డీల్ పరిమితం కానుంది. తమ ఆపరేటింగ్ బిజినెస్ల అమ్మకం, ఆసియన్ అసెంట్ ఈక్విటీ షేర్లను వేరుచేయడానికి ఈ డీల్ సమర్థవంతంగా ఉపయోగపడుతుందని యాహూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మారిస్సా మేయర్ ఓ ప్రకటనలో తెలిపారు. షేర్హోల్డర్స్ విలువను అన్ లాక్ చేయడానికి ఈ ప్లాన్ కీలకమైన అడుగు అని పేర్కొన్నారు.

యాహూ రియల్ ఎస్టేట్ ఆస్తులకు, అలీబాబాలోని షేర్లకు, జపాన్లోని యాహు షేర్లకు, యాహూ కన్వర్టబుల్ నోట్స్కు, కొన్ని మైనార్టీ ఇన్వెస్ట్మెంట్లకు, నాన్-కోర్ పేటెంట్లకు ఈ అమ్మక ఒప్పందం వర్తించదని తెలుస్తోంది. అలీబాబా, జపాన్ ఇన్వెస్ట్మెంట్ల విలువ దాదాపు 40 బిలియన్ డాలర్లు(సుమారు రూ.2,69,080కోట్లు). శుక్రవారం మార్కెట్లు ముగిసేనాటికి యాహూ 37.4 బిలియన్ డాలర్ల(రూ.2,51,589.8కోట్ల) మార్కెట్ విలువను కలిగి ఉంది. 140 మిలియన్లకు పైగా యూజర్లతో  ఉన్న వెరిజోన్ ..మీడియా, ప్రకటనల వ్యాపారం కొనుగోలు కోసం అడ్వర్ టైజింగ్ టెక్నాలజీ ప్లాట్ ఫాంని రూపొందించాలనే యోచనలో యాహూ పై కన్నేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Verizon  Yahoo  $4.8 Billion  Warren Buffett  video  US  TechCrunch  

Other Articles