LG TV: Mosquito Away tech in new LG TVs fights Zika, malaria

Mosquito repellent lg tv goes on sale in india

lg, lg mosquito away tv, lg mosquito tv, mosquito away tv, mosquito, dengue, mosquito away tv price, mosquito away tv features, mosquito away tv specs, tv, television, gadgets, technology, technology news

LG Mosquito Away TV is equipped with an Ultra Sonic device, which uses the sound wave technology to keep mosquitoes away.

భారతీయ విఫణిలో ప్రారంభమైన దోమలను తరిమే టీవీలు

Posted: 06/18/2016 03:02 PM IST
Mosquito repellent lg tv goes on sale in india

దోమలను తరిమేసే మస్కిటో రిపెల్లింగ్ టెలివిజన్ సెట్ విక్రయాలు భారతీయ విఫణిలో ప్రారంభమయ్యాయి. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ గూడ్స్ దిగ్గజ సంస్థ ఎల్ జీ ఎలక్ట్రానిక్స్ కనిపెట్టిన సరికొత్త సాధనం "మస్కిటో రిపెల్లింగ్ టీవీ" అమ్మకాలు ప్రారంభమయ్యాయి. దీంతో ఈ టీవీ సెట్ లను కోనుగోలు చేసిన వారిళ్లు మలేరియా, డెంగ్యూ, జికా వైరస్ ల నుంచి ఇక బయటపడట్టే. సరికొత్త మస్కిటో ఎవే టెక్నాలజీని అల్ట్రా సోనిక్‌ తరంగాలతో ఎల్ జీ ఈ టీవీని రూపొందించింది.

ఈ తరంగాలతో దోమల చెవులు బద్దలై, ఇంట్లో నుంచి పారిపోతయాని కంపెనీ వెల్లడించింది. దీనికి సమానమైన టెక్నాలజీ ఎయిర్ కండీషనర్స్, వాషింగ్ మెషిన్స్ లో కూడా వాడటానికి చెన్నైకి దగ్గర్లోని ఓ ల్యాబోరేటరీ నుంచి సర్టిఫికేట్ పొందామని ఎల్జీ తెలిపింది. టీవీ స్విచ్ ఆఫ్ చేసినా ఈ టెక్నాలజీ పనిచేసేలా రూపొందించామని, రెండు మోడల్స్ లో ఇది లభ్యమవుతోందని కంపెనీ పేర్కొంది. ఒకటి రూ.26,500 కు, మరొకటి రూ.47,500లకు మార్కెట్లోకి తీసుకొచ్చామని ఎల్జీ ప్రకటించింది.

దోమల వల్ల వచ్చే ప్రాణాంతక వ్యాధుల నుంచి అల్ప ఆదాయ వినియోగదారులను రక్షించి, ఆరోగ్యంగా ఉంచే లక్ష్యంతో దీన్ని రూపొందించామని పేర్కొంది. శ్రీలంక, ఫిలిప్పీన్స్ లో వచ్చే నెలనుంచి అమ్మకాలు చేపడతామని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ అధికారి కిమ్ సుంగ్ యేల్ తెలిపారు. లాటిన్ అమెరికాను గడగడలాడించిన జికా వైరస్ ప్రభావంతో ఈ టీవీ రూపకల్పనకు ఎల్జీ శ్రీకారం చుట్టింది. ఈ జికా వైరస్ ప్రభావం రియో నగరంలో కూడా ఉందని ఆగస్టులో జరగబోయే ఒలంపిక్స్ ను అక్కడి నుంచి తరలించాలని డిమాండ్ వెల్లువెత్తిన క్రమంలో ఎల్జీ ఈ వినూత్న సాధనాన్ని వేగవంతంగా అభివృద్ధి చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : LG Electronics  sells  mosquito-repelling TV  indian market  

Other Articles