Gold Soars Close to Two-Year High as Fed and Brexit Boost Demand

Gold hits rs 30000 mark on global cues jewellers buying

Federal reserve, gold rates, gold price, gold, silver, silver rates, bullion market, gold shining, indian market, Gold Prices,Silver,Bullion,US Federal Reserve,Janet Yellen,interest rate,Singapore , Gold hits Rs 30,000 on global cues, jewellers buying,news, India news,Markets News,

Gold prices surged by Rs 580 on Thursday to trade above the Rs 30,000 mark at Rs 30,250 per 10 gram, its highest level in over five weeks at the bullion market, largely in tandem with firming global trend.

వన్నె పెరుగుతున్న పసడి.. రెండేళ్ల గరిష్ట స్థాయికి..

Posted: 06/16/2016 09:12 PM IST
Gold hits rs 30000 mark on global cues jewellers buying

అమెరికా రిజర్వు, ఫెడ్ వడ్డీరేట్లను పెంచుతుందో లేదో తెలియక సతమతమైన బులియన్ మార్కెట్ కు తీపి కబురు అందించింది. ఫెడ: రేట్లలో ఎలాంటి మార్పు లేదని ఫెడరల్ రిజర్వు ఓపెన్ మార్కెట్ కమిటీ ద్రవ్య పరపతి విధాన సమీక్ష అనంతరం ప్రకటించడంతో సానుకూలంగా స్పందించింది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పసిడి మెరుపులు మెరిపిస్తోంది. ఎకంగా నష్టాల బాటను వీడిన లాభాల భాటను అందుకుంది.  బుధవారం నష్టాల్లో కదలాడిన పుత్తడి ధరలు ఫెడ్ ప్రకటనలతో పరుగులు పెడుతూ భారీ లాభాలతో దూసుకుపోతోంది.

ఫెడ్ సానుకూల నిర్ణయంతో ఇవాళ కొన్న గంటల వ్యవధిలోనే దాదాపు 500 రూ. కు పైగా లాభపడింది. ప్రస్తుతం 526 రూపాయల లాభంతో 30,970 దగ్గర ట్రేడవుతూ 31 వేల మార్క్ కు చేరువలో ఉంది. అటు  డాలర్ తో పోలిస్తూ భారత కరెన్సీ రూపాయి 2 పైసలు బలపడింది. ప్రపంచ ప్రధాన కరెన్సీల కంటే అమెరికా కరెన్సీ బలహీనపడి నేల చూపులు చూస్తూ వుండడంతో రూపాయి క్రమేపీ బలపడుతోంది. దీంతో పసిడి కూడా కొత్త పుంతలను తాకుతోంది.

కాగా  ఆర్థికవ్యవస్థ వృద్ధి కొనసాగుతున్నప్పటికీ, ఉద్యోగాల వృద్ధి తక్కువగా నమోదైందని  ఫెడ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో వడ్డీరేట్లను యథాతథంగా ఉంచినట్టు తెలిపింది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా పాలసీ నిర్ణయాన్ని ప్రభావితం చేశాయని ఫెడ్ గవర్నర్ జానెట్ యెల్లెన్ పేర్కొన్నారు.  యూరోపియన్ యూనియన్లో కొనసాగడమా..వైదొలగడమా.. అనే నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్లో తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని పేర్కొన్నారు.అయితే వడ్డీ రేట్ల పెంపు ఎపుడు ఉంటుందున్నది  పేర్కొనలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Federal reserve  gold rates  gold price  gold  silver  silver rates  bullion market  gold shining  indian market  

Other Articles