Nifty ends below 7900, Sensex up 120 pts; oil stocks support

Sensex ends 120 points higher oil gas shares lead gains

sensex, nifty, indian share market, indian stock exchange, sensex at a low, two year low of sensex, janet yellen, janet yellen united states reserve federal chairperson, united states federal reserve bank, united states federal reserve chairperson

Indian markets ended with modest gains after profit booking in the last hour of trade. The Sensex closed 120.38 points higher at 25,773.61 and the Nifty ended 30 points higher at 7,891.

విదేశీ సానుకూల పవనాలు.. అయిల్ అండ్ గ్యాస్ ర్యాలీ.. లాభాల్లో మార్కెట్లు

Posted: 05/17/2016 04:03 PM IST
Sensex ends 120 points higher oil gas shares lead gains

ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలను అర్జించాయి, విదేశాల నుంచి వచ్చిన సానుకూల పవనాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు లాభాలను అందుకున్నాయి. ముఖ్యంగా అయిల్ అండ్ గ్యాస్ రంగంలో దూసుకోచ్చిన లాభాలు మార్కెట్లను లాభాల బాటలో పయనింపజేశాయి. ఈ నేపథ్యంలో అటు సెన్సెక్స సహా ఇటు నిఫ్టీ కూడా లాభాలను గడించాయి. సెన్సెక్స్ 120 పాయింట్ల లాభాన్ని అర్జించగా, ఇటు నిఫ్టీ కూడా బెంచ్ మార్క్ 7850 మార్కును దాటి 7900 మార్కుకు చేరవకు చేరుకుంది.

మార్కెట్లు ముగిసే సమయానికి 0,47 లాభాన్ని అందుకున్న సెన్సెక్స్ 120 పాయింట్ల లాభంతో 25 వేల 774 పాయింట్ల వద్దకు చేరుకుంది. అటు నిఫ్టీ కూడా బెంచ్ మార్క్ 7850 మార్కుకు ఎగువకు చేరుకుంది. నిఫ్టీ కూడా 30 పాయింట్ల లాభంతో 7 వేల 891 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించింది, మొత్తంగా 2,783 కంపెనీల షేర్లు ట్రేడింగ్ లో పాల్గొనగా, 1,300 కంపెనీల షేర్లు లాభాలను ఆర్జించగా, 1,306 కంపెనీల షేర్లు నష్టాలను నమోదు చేశాయి. కాగా 177 కంపెనీల షేర్లు తటస్థంగా నిలిచాయి.

ఇవాళ్లి ట్రేడింగ్ లో అటో, అయిల్ అండ్ గ్యాస్, క్యాపిటల్ గూడ్స్ సూచీల షేర్లు లాభాలను గడించాయి. కాగా బ్యాంకింగ్ నిఫ్టీ, హెల్త్ కేర్, ఐటీ, టెక్నాలజీ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సూచీలు లాభాలను అర్జించాయి. కాగా, ఎఫ్ఎంజీసీ, మెటల్స్ రంగాల సూచీలు నష్టాల్లోకి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఓఎన్జీసీ, యాక్సిక్ బ్యాంక్, హెచ్ డి ఎప్ సి, అల్ట్రాటెక్ సిమెంట్, బిపిసీఎల్ తదితర సంస్థల షేర్లు లాభాలను ఆర్జించగా, ఏషియర్ మెటార్స్, ఎన్జీపిసీ, అరబిందో ఫార్మా, హచ్ యు ఎల్, టాటా మోటార్స్ తదితర సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.    

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  indian share market  indian stock exchange  

Other Articles