Samsung launches Galaxy S7, S7 Edge at Rs 48900 and Rs 56900

Samsung s7 s7 edge launch could trigger price war

samsung galaxy s7, galaxy s7, galaxy s7 price, gear vr, galaxy s7 pre-booking, gear vr in india, galaxy s7 price, galaxy s7 edge, galaxy s7 india launch, samsung, galaxy s7 specs, galaxy s7 features, galaxy s7 edge specs, galaxy s7 price, galaxy s7 vs galaxy s6, technology, technology news

Samsung Galaxy S7 and Galaxy S7 edge launched at Rs 48,900 and Rs 56,900 respectively. Samsung is offering free Gear VR headset with preorders

గెలాక్సీ ఎస్ 7, ఎస్ 7 ఎడ్జ్ ను విడుదల చేసిన శామ్‌సంగ్‌

Posted: 03/09/2016 05:59 PM IST
Samsung s7 s7 edge launch could trigger price war

 ప్రఖ్యాత మొబైల్ కంపెనీ శామ్‌సంగ్‌ భారత్ మార్కెట్‌లో తన కొత్త మోడళ్లైన గెలాక్సీ ఎస్‌7, ఎస్‌7 ఎడ్జ్‌లను లాంచ్‌ చేసింది. తన ఫ్లాగ్‌షిప్‌ మోడళ్లయిన ఈ రెండు ఫోన్లను ఇటీవల మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌ లో లాంఛనంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. భారత్‌లో గెలాక్సీ ఎస్‌7 (32 జీబీ) రూ. 48,900, ఎస్‌7 ఎడ్జ్‌ (32 జీబీ) రూ. 56,900లకు లభించనున్నాయి.   

ఈ స్మార్ట్‌ఫోన్లను ప్రతిష్టాత్మక ఫీచర్లతో అందిస్తున్నట్టు కంపెనీ చెపుతోంది. ఈ కొత్త మోడళ్ల డిస్‌ప్లే ఎల్లప్పుడూ ఆన్‌లోనే ఉంటుందని, అలాగే తొలిసారి ఈ మొబైళ్లలో డుయల్ పిక్సల్ కెమెరాను వాడినట్టు శామ్‌సంగ్ తెలిపింది. గెలాక్సీ ఎస్‌7 త్రీడీ గ్లాస్ మెటల్ బాడీతో వస్తుంది. దీనిలో 5.1 క్యూహెచ్‌డీ డిస్‌ప్లే ఉంటుంది. ఇక ఎస్‌7 ఎడ్జ్‌ లో 5.5 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. ఈ రెండు ఫోన్లలోనూ 12 మెగా పిక్సల్‌ డుయల్ రియర్‌ లెన్స్ ఉంటాయి.

ఈ తాజా మోడళ్ల స్పెషాలిటీ ఏమిటంటే వీటి మెమరీ స్టోరేజీని బాగా ఎక్స్‌పాండ్ చేసుకునే వీలుండటం. ఈ రెండు ఫోన్లలోనూ మైక్రో ఎస్డీ కార్డ్‌ మెమరీ 200 జీబీ వరకు పెంచుకోవచ్చు. కొన్ని దేశాల్లో ఈ మెమరీ ట్రేను డ్యూయల్ సిమ్‌గా కూడా వాడుకునే అవకాశాన్ని కంపెనీ కల్పిస్తోంది. అలాగా ఈ రెండు కొత్త ఫోన్ల ర్యామ్ సామర్థ్యాన్ని 3జీబీ నుంచి 4 జీబీకి పెంచింది. వాటర్‌, డస్ట్ రెసిస్టెంట్‌ అయిన ఈ రెండు ఫోన్లలో గెలాక్సీ ఎస్‌-7 బ్యాటరీ సామర్థ్యం 3000ఎంఏఎహ్‌ కాగా, ఎస్‌7 ఎడ్జ్‌ బ్యాటరీ పవర్‌ 3600ఎంఏహెచ్‌. బ్లాక్ షప్పైర్, గోల్డ్‌ ప్లాటినమ్‌, సిల్వర్ టైటానియం రంగుల్లో మూడు వేరియంట్లలో లభించే ఈ ఫోన్లు ఈ నెల 18 నుంచి మార్కెట్‌లో అమ్మనున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Android  Smartphones  galaxy s7  Galaxy S7 Edge  Samsung  

Other Articles