AirAsia India Announces Festive Sale, Tickets From Rs 1,590 on Offer

Airasia india announces special offers this festive season

civil aviation industry, airasia india, Festival Sale, air tickets, domestic customers, SpiceJet, IndiGo, global sale offer, international destinations, Low fares, Malyasian budget carrier, No-frills carrier, promotional seats, domestic destinations

AirAsia India has announced a festive sale scheme, offering tickets as low as Rs 1,590 (all-inclusive). Bookings for this AirAsia scheme - applicable on travel between October 20, 2015 and February 29, 2016 - are open till November 1.

పండుగ వేళ.. కస్టమర్లకు ఏయిర్ ఏషియా ఆఫర్లు..

Posted: 10/20/2015 08:19 PM IST
Airasia india announces special offers this festive season

సీజన్ ను వాడుకుంటూ.. కాలానికి తగ్గట్లుగా ఆపర్లను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటూ ముందుకెళ్తున్నాయి విమానయాన సంస్థలు. పండుగ వేళ బస్సులు,రైళ్లలో టికెట్లు లభించిన వారిని పక్కన బెడితే.. లభించని వారు చిన్న ప్రయాణమైన వందలాది రూపాయలను వెచ్చించాల్సి వస్తుంది. అందుకనే ఏయిర్ ఏషియా విమానయాన సంస్థ పండుగ వేళ చౌక ఆపర్లను ప్రకటించింది. పండుగ వేళ బస్సులు, రైళ్లు, ప్రైవేటు వాహనాలకు బదులు ఏకంగా విమానంలో చౌకగా ప్రయాణించే అవకాశాలను కల్పించింది.  అక్టోబర్, నవంబర్ నెలలు పండుగ సీజన్లు కాబట్టి ఈ సమయంలో ప్రయాణికుల రద్దీని సొమ్ము చేసుకోడానికి స్పైస్‌జెట్ సంస్థ అర్ధరాత్రి ప్రయాణాలను ప్రవేశపెట్టిన తరుణంలో ఏయిర్ ఏషియా కూడా పోటీ పడుతోంది.

అక్టోబర్ 20వ తేదీ.. అంటే ఇవాళ్టి నుంచి 2016 ఫిబ్రవరి 29 వరకు చేసే ప్రయాణాలకు సంబంధించిన విమాన టికెట్లకు ఎయిర్ ఏషియా ఓ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. నవంబర్ ఒకటో తేదీలోగా టికెట్లు బుక్ చేసుకుంటే, పన్నులన్నీ కలిపి కనిష్ఠంగా రూ. 1590కే ఈ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. బెంగళూరు నుంచి కొచ్చి, గోవా మార్గాల్లో వెళ్లడానికి రూ. 1590, అదే బెంగళూరు నుంచి పుణె అయితే రూ. 1990 ధర పెట్టిన ఎయిర్ ఏషియా, ఢిల్లీ- బెంగళూరు మార్గంలో మాత్రం రూ. 4290గా టికెట్ ధర నిర్ణయించింది. ఢిల్లీ-గోవా మార్గంలో రూ. 3990, గువాహటి -ఇంఫాల్ మార్గంలోను, ఢిల్లీ-గువాహటి మార్గంలోను రూ. 1690కి టికెట్లు ఉన్నాయి. నవంబర్ 1వ తేదీలోగా ఈ టికెట్లు బుక్ చేసుకోవాలి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AirAsia India  Festival Sale  air tickets  domestic customers  

Other Articles