after competitors, now snapdeal announces big electronics sale on July 27-28

Snapdeal s big electronics sale on july 27 28

Snapdeal's big electronics sale on July 27-28, Snapdeal, electronics sale, july, discount offers, Snapdeal announced electronics sale, snapdeal offering up to 70 per cent discount, e-commerce portal Snapdeal, competitors, Flipkart, Amazon, Snapdeal's big electronics sale on July 27-28 , Snapdeal's big electronics sale on July 27-28,news, India news

Following its competitors Flipkart and Amazon, e-commerce portal Snapdeal announced electronics sale on July 27 and 28, offering up to 70 per cent discount.

స్నాప్‌డీల్‌.. బిగ్ ఎలక్ట్రానిక్స్ సేల్.. ఈ నెల 27, 28న..

Posted: 07/26/2015 03:50 PM IST
Snapdeal s big electronics sale on july 27 28

ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లకు పోటీగా ఇ-కామర్స్‌ దిగ్గజం స్నాప్‌డీల్‌ ఈ నెల 27, 28 తేదీల్లో భారీ స్థాయిలో ఎలక్ర్టానిక్స్‌ సేల్‌ నిర్వహించనుంది. ఇందులో వివిధ రకాల ఎలక్ర్టానిక్స్‌ ఉత్పత్తులపై గరిష్ఠంగా 70 శాతం వరకు డిస్కౌంట్లను ఆఫర్‌ చేస్తోంది. డిస్కౌంట్లతో పాటు అన్ని బ్రాండ్లపై ప్రత్యేక ఆఫర్లు కూడా ఉన్నట్టు స్నాప్‌డీల్‌ చెబుతోంది. మొబైల్స్‌, టాబ్లెట్లు, కంప్యూటర్లు, లాప్‌టా్‌ప్సపై మంచి ఆఫర్లు ఉన్నాయని పేర్కొంది. డిజిటల్‌ ఎస్‌ఎల్‌ఆర్‌ కెమెరాలపై 18,000 రూపాయల వరకు డిస్కౌంట్‌ ఇస్తోంది. ముందుగా రిజిస్టర్‌ చేసుకున్న కస్టమర్లకు ఆకర్షణీయమైన ఆఫర్లను అందజేస్తోంది.

ఎలక్ర్టానిక్స్‌ సేల్‌ ఆఫర్‌ ద్వారా అమ్మకాలు భారీ స్థాయిలో పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నట్టు స్నాప్‌డీల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (ఎలక్ర్టానిక్స్‌, హోమ్‌) టోని నవిన్‌ తెలిపారు. ఏడు లక్షలకు పైగా ఎలక్ర్టానిక్స్‌ ఉత్పత్తులను అందుబాటులో ఉంచామని, కొనుగోలు చేసిన తదుపరి రోజే డెలివరీ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మే నెలలో ఫ్లిప్‌కార్ట్‌, ఈ నెల 21, 22 తేదీల్లో అమెజాన్‌ భారీ స్థాయిలో ఎలక్ర్టానిక్‌ సేల్‌ను నిర్వహించాయి. ఈ నేపథ్యంలో స్నాప్ డీల్ కూడా ఈ నెల  27, 28 తేదీల్లో భారీ స్థాయి లో ఎలక్ర్టానిక్స్‌ సేల్‌ నిర్వహించనుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Snapdeal  electronics sale  july  discount offers  

Other Articles