Microsoft plans celebratory global debut of Windows 10

India among 13 countries to host windows 10 launch

India among 13 countries to host Windows 10 launch, Microsoft plans celebratory global debut of Windows 10, windows 10, microsoft, Gizmodo, July 29, global fan celebrations, retailers, Microsoft store locations, Microsoft, CEO Satya Nadella, global debut, Windows 10, India

Windows 10 will be launched across the world on July 29 amid global fan celebrations, joint efforts with thousands of retailers, including all Microsoft store locations

విండోస్ 10 విడుదలకు ఖరారైన ముహూర్తం.. కండీషన్లు

Posted: 07/14/2015 04:57 PM IST
India among 13 countries to host windows 10 launch

ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న విండోస్‌-10ను ఈ నెల 29 నుంచి ప్రపంచవ్యాప్త టెక్నాలజీ ప్రియులకు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ప్రకటించింది. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్‌ సంస్థ.. పలు ప్రధాన నగరాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను అభివృద్ధి చేసిన బృందంలోని సభ్యులను కలుసుకునే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్‌ ఒక బ్లాగ్‌పోస్టులో పేర్కొంది. విండోస్‌ 10 ప్రస్తుతం ఉన్న ఓఎస్‌లన్నిటికన్నా అత్యంత వేగవంతమైనది, సురక్షితమైనదని వెల్లడించింది.

విండోస్‌ 7, విండోస్‌ 8 ఒరిజినల్‌ వెర్షన్లు వాడుతున్నవారెవరైనా సరే విండోస్‌ 10కు ఉచితంగా అప్‌గ్రేడ్‌ కావచ్చునని తెలిపింది. అయితే, ఈ ఆఫర్‌ తొలి ఏడాదికే మాత్రమే పరిమితం చేసింది. ఆ తరువాత కూడా విండోస్ 10ను వినియోగించుకోదలచుకున్న వాళ్ల సాఫ్ట్ వేర్ ను కోనుగోలు చేయాల్సిందేనని తెలిపింది. కాగా.. 29న ఓఎస్‌ను లాంచ్‌ చేస్తున్నప్పటికీ అందరికీ ఆ రోజు అప్‌గ్రేడ్‌ అందుబాటులోకి రాదని పేర్కొంది. ముందుగా దీన్ని.. ఓఎస్‌ తయారీలో కీలకపాత్ర పోషించిన టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంచునున్నామని తెలిపారు.

ఆ తరువాత క్రమంగా మిగతావారికి అందుబాటులోకి తెస్తామని తెలిపింది. జూలై 29 ఆ తర్వాత కొత్తగా కంప్యూటర్లు కొనుగోలు చేసేవారికి ప్రాధాన్యమిస్తారు. కాగా విండోస్‌ 10లో మళ్లీ స్టార్ట్‌మెనూ జోడించారు. మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌ అనే సరికొత్త బ్రౌజర్‌ను పొందుపరిచారు. మనం అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ వ్యక్తిగత సహాయకురాలిగా వ్యవహరించే కోర్టానా ప్రోగ్రామ్‌ ఉంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Microsoft  CEO Satya Nadella  global debut  Windows 10  India  

Other Articles