Weak global cues & rupee drag Sensex 118 pts

Stock market sell off wipes out 2015 gains bonds falter

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, CRR, fiscal consolidation, GDP growth, R&B, Raghuram Rajan, RBI, RBI rate cut, Repo rate, RBI governer raghuram rajan, Reserve Bank of India monetary policy, RBI policy rates in April, Reporate, Reverse Repo Rate, CRR SLR MSF, Today sensex, today nifty, Infosys, Indian rupee, currency, dollar,

The Indian rupee hit a fresh 20-month low today, breaching 64 a dollar mark weighed down by global debt sell off, weak equity markets and government's taxation policies. The currency slipped 69 paise to 64.23 a dollar, the biggest intraday fall since December 15, 2014.

20 నెలల కనిష్టస్థాయికి రూపాయి.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

Posted: 05/07/2015 08:37 PM IST
Stock market sell off wipes out 2015 gains bonds falter

విదేశాల నుంచి వచ్చిన ప్రతికూల పవనాలకు తోడు రూపాయి మారకం విలువ 64 రూపాయలకు చేరడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ కూడా లాభాలను మూటగట్టుకున్నాయి. ప్రభుత్వ పన్ను విధానంలో మార్పలు రూపాయి విలువను 20 మాసాల కనిష్ట స్థాయికి తీసుకెళ్లడంతో.. ఇవాళ 69 పైసల మేర కుంగిపోయిన రూపాయి... 64 రూపాయల 23 పైసల వద్ద ముగిసింది. గత ఏడాది డిసెంబర్ 15 తరువాత ఒక్క రోజులో రూపాయి విలువ ఈ స్థాయిలో దిగజారడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

రూపాయి కుచించుకుపోవడంతో మార్కెట్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. క్రితం రోజు భారీగా పతనమైన ప్రభావం కూడా పడటంతో ఉదయం ప్రారంభంలోనే సెస్సెక్స్ 60 పాయింట్లను నష్టపోగా, నిఫ్టీ 30 పాయింట్లను నష్టపోయింది. మద్యాహ్నం నుంచి కొద్దికొద్దిగా నష్టాలను మూటగట్టుకున్న స్టాక్ మార్కెట్లు ముగింపు సమయానికి నష్టాల బాట పట్టాయి. సెన్సెక్స్ 118 పాయింట్లు నష్టపోయి 26 వేల 599 పాయింట్ల వద్దకు చేరుకోగా, నిఫ్టీ 40 పాయింట్లు నష్టపోయి.. 8 వేల 57 పాయింట్లకు చేరింది. బిఎస్ఈ టెక్నాలజీ ఐటీ, ఎఫ్ఎంజీసీ సెక్టార్లు మినహాయించి అన్ని రంగాల సూచీలు నష్టాలలో కూరుకుపోయాయి.

బ్యాకింక్ రంగ సూచీలు, కన్యూమర్ డ్యూరబుల్స్ సూచీలు అధికంగా నష్టపోయాయి. వీటికి తోడు.. మధ్య తరహా, చిన్న తరహా పరిశ్రమల సూచీలు ఆటో సూచీలు కూడా నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈ క్రమంలో ఇవాళ టీసీఎస్, హెచ్ సీ ఎల్ టెక్, ఏసీసీ, బజాజ్ ఆటో, కోల్ ఇండియా సంస్థల షేర్లు లాభాలను ఆర్జించగా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడిఎఫ్సీ, కోటక్ మహీంద్రా, యాక్సిక్ బ్యాంక్, యస్ బ్యాంక్ సంస్థల షేర్లు నష్టాలను చవిచూశాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  Infosys  indian rupee  

Other Articles