Gold prices extend losses for second straight day on global cues, silver recovers

Gold extends losses on global cues silver stages recovery

Gold price, silver price, commodities, bullion market, Federal Reserve, US Fed, Gold, Silver, gold and silver, Gold price, futures trade, weak cues from global market

In a mixed pattern of trading, gold extended losses for the second straight day and prices fell by another Rs 160 to Rs 27,030 per ten grams in tandem with weak global market, while silver rebounded by Rs 510 to Rs 37,210 per kg on revival of buying by industrial units.

తగ్గుతున్న పసిడి కాంతులు.. పెరిగిన బంగారం ధరలు

Posted: 05/02/2015 04:45 PM IST
Gold extends losses on global cues silver stages recovery

అంతర్జాతీయ విపణిలో పసిడికి కాంతులు తగ్గతున్నాయి. స్వర్ణం ధర క్రమంగా దిగి వస్తోంది. అమెరికాలో నిరుద్యోగత బాగా తగ్గిందని గణాంకాలు వెలువడిన నేపథ్యంలో, వడ్డీరేట్ల పెంపునకు అవకాశం ఉందనే అంచనాలు పెరిగాయి. అమెరికాలో నిరుద్యోగ భృతి కోసం అందే దరఖాస్తులు గత 15 ఏళ్లలోనే అత్యంత తక్కువగా ప్రభుత్వానికి చేరాయి. దీనితో డాలర్‌కు గిరాకీ పెరుగుతోంది. ఇందువల్ల పెట్టుబడులు పుత్తడిపై తగ్గి, డాలర్ దిశగా మళ్లుతున్నాయి. ఏప్రిల్‌లో పెరిగిన పసిడి విలువ అంతా ఒక్క రోజులోనే హరించుకుపోయింది. లండన్ విపణిలో ఔన్సు (31.10) గ్రాముల బంగారం ధర 1172 డాలర్లకు దిగి వచ్చింది. ఒక్కరోజే 1.7 శాతానికి పైగా తగ్గింది. గత 8 వారాల్లో ఇంత తగ్గడం ఇప్పుడే. ఏప్రిల్ 28న 3 వారాల గరిష్ఠస్థాయికి పసిడి ధర పెరిగింది. కాగా వెండి ధర మాత్రం పుంజుకుంది.

ఇటు దేశీయంగా కూడా బంగారం ధరల దిగివచ్చింది. బులియన్ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా తగ్గినా.. పెళ్లిళ్ల సీజన్ నేపధ్యంలో శుభ ముహూర్తాలు ఉన్నందున, పసిడి ధరను తగ్గడం లేదు. అయితే ఇవాళ మాత్రం విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల పవనాల నేపథ్యంలో వరుసగా మూడో రోజు నష్టాలను చవిచూసింది. బంగారం ధరల 160 రూపాయల మేర తగ్గి.. 27 వేల 30 రూపాయల వద్ద ట్రేడింగ్ సాగిస్తుంది. కాగా వెండి మాత్రం 510 రూపాయల ధర పుంజుకుని కేజీ వెండి 37 వేల 210 రూపాయల ట్రేడింగ్ కోనసాగిస్తుంది. హైదరాబాద్ బులియన్ విపణిలో శుక్రవారం రాత్రి 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.26,930 స్థాయిలో ఉంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gold prices  Silver prices  futures trade  weak cues from global market  

Other Articles