Stock markets marks high profits on friday

BSE Sensex, NSE Nifty, India's stock market, Sensex, Stocks, Sensex today, BSE, NSE, Asian Paints, BPCL, Capital goods, Realty, banking, FMGC,

The benchmark Sensex today soared by 380 points, logging its sixth successive session of gains, to nearly four-week highs boosted by gains in banking stocks on hopes of much-awaited sectoral reforms and encouraging manufacturing output data for December.

భారీ లాభాలను ఆర్జించిన స్టాక్ మార్కెట్లు

Posted: 01/02/2015 09:49 PM IST
Stock markets marks high profits on friday

నూతన సంవత్సరంలో సరికోత్త జోష్ తో వున్న మదుపరులు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే వడ్డీ రేట్లను సవరిస్తుందన్న వార్తల నేపథ్యంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపడంతో దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాలను ఆర్జించాయి. వరుసగా ఆరు రోజుల పాటు లాభాలను ఆర్జించిన సెన్సెక్స్ ఇవాళ 380 పాయింట్లను ఆర్జించింది. దీంతో నాలుగు వారాల గరిష్టస్థాయికి సెన్పెక్స్ చేరుకుంది. బ్యాంకింగ్ రంగంలో సవరణలతో సంబంధిత సంస్థల షేర్లు ర్యాలీని కోనసాగించడంతో స్టాక్ మార్కెట్ సూచీలు వారాంతంలో లాభాలను ఆర్జించాయి.

దీనికి తోడు విదేశీ ష్టాక్ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలతో సూచీలు 380 పాయింట్లకు పైగా లాభాన్ని గడించాయి. బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ 380 పాయింట్లు లాభపడి 27, 937 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 111 పాయింట్లు ఎగసి 8,400 మార్కును తాకి 8, 396 పాయింట్ల వద్దకు చేరుకుంది. ప్రభుత్వం, పబ్లిక్ సెక్టార్ యూనిట్ సహా ప్రైవేటు సెక్టార్ బ్యాంకుల షేర్లు కొనుగోళ్లకు మదుపరులు వెంటపడ్డారు.

బ్యాంకింగ్ రంగ షేర్లతో పాటు కాపిటల్ గూడ్స్, ఐటీ, పవర్; టక్నాలజీ, రియాల్టీ రంగ షేర్లు అధికంగా లాభాలను ఆర్జించాయి. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం పలు ఆర్థిక సంస్కరణనలను ప్రవేశపెట్టనుందన్న వార్త కూడా ర్యాలీ కొనసాగింపుకు దోహదపడింది. ఈ క్రమంలో హెచ్‌డీఎఫ్‌సీ, ఆసియన్ పెయింట్స్, జిందాల్ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర షేర్లు లాభాల బాటలో సాగాయి. బీపీసీఎల్, ఎంఅండ్ఎం, ఎన్ఎండీసీ, హెచ్‌యూఎల్, రిలయన్స్ తదితర సంస్థలు నష్టాలు ఎదుర్కొన్నాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BSE Sensex  NSE Nifty  India's stock market  

Other Articles