All accounts under one common account only

rbi, raghu ram rajan, rbi governer press meet, sebi news, new policy from rbi, new policy from sebi, new policy from finance ministry, one common account

rbi and sebi have taken a decission to bring common account to all people. various accounts under one common account only

ఇప్పుడన్నీ ఒకే ఖాతాలో....!!

Posted: 12/12/2014 02:24 PM IST
All accounts under one common account only

ఒక సరి కొత్త పద్దతిని ప్రవేశ పెట్టటానికి ఆర్.బి.ఐ, సెబీ, ఐ.ఆర్.డి.ఏ ఉమ్మడిగా కసరత్తు చేస్తున్నాయి. ఇప్పుడు మీకు మూడు నాలుగు బ్యాంకు ఖాతాలు ఉండచ్చు. ఇంకా ఒక రెండు డీమ్యాట్ ఖాతాలు ఉండచ్చు.., విడిగా ఇంకొన్ని భీమా బాండ్లు కూడా ఉండచ్చు. ఇప్పుడున్న పద్దతిలో ఇవన్ని విడి విడిగా ఉన్నాయి. అదే ఈ ఖాతాలన్నిటిని ఒకే ఉమ్మడి ఖాతా కిందకి ప్రవేశ పెడితే ఎలా ఉంటుంది. మీ ఆర్ధిక పరమైన ఆస్తుల వివరాలన్నిటిని, వ్యవహారాలన్నిటిని ఒకేసారి, ఒకే వేదిక పై చూసుకునే వీలు కలుగుతుంది. ఈ వినూత్న ఆలోచనను అమలులో పెట్టటానికి ఆర్ధిక నియంత్రణ సంస్థలైన ఆర్.బి.ఐ, సెబీ, ఐ.ఆర్.డి.ఏ లు కృషి చేస్తున్నాయి.

వినటానికి కొంత గందరగోళంగా ఉన్న.., ఇవ్వన్ని ఒకే ఖాతా కిందకి త్వరలోనే రాబోతున్నాయన్నది ఆర్.బి.ఐ వర్గాలు అంతర్గతంగా స్పష్టం చేస్తున్నాయి.  బ్యాంకు ఖాతాలు, షేర్లు, భీమాబాండ్లు, భీమా, మ్యూచువల్ ఫండ్లు... ఇవ్వన్ని వేర్వేరు నియంత్రణ సంస్థల కిందికి వస్తాయన్నదే మీ సందేహం కదా...!! కానీ ఇవి వేర్వేరు నియంత్రణ సంస్థల కిందకి వచ్చేవే అయినా ఒకే ఖాతా ద్వారా తెలుసుకునే సౌలభ్యాన్ని అందిచాలన్నది ఈ ఆలోచన ముఖ్యోద్దేశం అందుకే ఒక ఉప సంఘాన్ని నియమించింది. ఇటీవల అంతర్ నియంత్రణ సాకేతిక బృందం (ఐ.ఆర్.టి.జి) చేసిన సలహా పై ఆర్ధిక స్థిరత్వం, అభివృద్ధి మండలి (ఎఫ్ ఎస్ డి సి)  ఉపసంఘం చర్చించింది.

ఈ ఉప సంఘం లో సభ్యులుగా ఆర్.బి.ఐ, సెబీ, ఐ ఆర్ డి ఏ, పి ఎఫ్ ఆర్ డి ఏ, ఎఫ్ ఎం సి, అధిపతులతో పాటు.., ఆర్ధిక శాఖా ప్రతినిధులు కూడా ఉంటున్నారు. ఈ ఉపసంఘం ఈ ఉమ్మడి ఖాతా అనే ఆలోచనపై కసరత్తు ఐ ఆర్ టి జి కి నివేదిక ను సమర్పించే అవకాశం ఉంది. ఈ విషయంపై ఆర్ బి ఐ గవర్నర్ రఘు రాం రాజన్ మాట్లాడుతూ... ఆర్ధిక నియంత్రణ సంస్థలకు చెందిన అన్ని ఖాతాలను ఒకే ఖాతాలో తెలుసుకోవటం కోసం  ఒక్వ ఉమ్మడి ఖాతాను సృష్టించాలని ఎఫ్ ఎస్ డి సి ఉపసంఘం నిర్ణయించింది. ఈ విషయం లో సాధ్యా సాధ్యాలపై చర్చించామని..., భవిష్యత్ లో ఖచ్చితంగా ఆ తరహా ఖాతాను ఏర్పాటు చేయాలనీ నిర్ణయించామన్నారు. ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తే ప్రజలకు అన్ని ఖాతాలు ఒకే దగ్గర చూసుకునే సౌలభ్యం కలుగనుందని ఆర్ధిక రంగ నిపుణులు సంతోషం వెలిబుచ్చుతున్నారు.

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : rbi  rbi governer  raghu ram raajan  one common account  

Other Articles