Google to sell nexus 6 for rs 44 000 nexus 9 at rs 28 900 onwards

Google, Motorola, micromax, HTC, Karbonn, smartphone, Nexus 9, Nexus 6, tablet google, andriodone phones

Google to sell Nexus 6 for Rs 44,000; Nexus 9 at Rs 28,900 onwards

భారతీయ విపణీలోకి గూగుల్ నెక్సస్ స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్

Posted: 11/08/2014 03:59 PM IST
Google to sell nexus 6 for rs 44 000 nexus 9 at rs 28 900 onwards

అందుబాటు ధరల్లో అనారాయిడ్ ఫోన్లను ప్రవేశపెట్టి విజయంవంతంగా విక్రయాలను జరిపిన సాంకేతిక రంగ దిగ్గజం గూగుల్.. దేశీయ విపణిలోకి నెక్సస్ 6 స్మార్ట్‌ఫోన్‌తో పాటు నెక్సస్ 9 టాబ్లెట్‌ను త్వరలో విడుదల చేయనుంది. అమెరికా దిగ్గజ సంస్థ మోటరోలా తయారుచేసిన నెక్సస్ 6 స్మార్ట్‌ఫోన్‌కు 5.96 అంగుళాల తెర, వెనుక-ముందు 13-2 మెగాపిక్సెల్ కెమేరాలు అమర్చారు. ఈ స్మార్ట్‌ఫోన్ 32 జీబీ వెర్షన్ ధర రూ.44,000 కాగా 64 జీబీ వెర్షన్ రూ.49,000. తైవాన్ దిగ్గజం హెచ్‌టీసీ అభివృద్ధి చేసిన 16జీబీ వైఫై మోడల్ నెక్సస్ 9 టాబ్లెట్ ధర రూ.28,900, 32 జీబీ ఎల్‌టీఈ (4జీ) మోడల్ ధర రూ.44,900గా గూగుల్ నిర్ణయించింది.

అయితే ఈ నెక్సెస్ 6 స్మార్ట్ ఫోన్ తో పాటు నెక్సస్ 9 టాబ్లెట్‌ను భారతీయ మార్కెట్లలో ఎప్పడు ప్రవేశపెట్టి,  అమ్మాకాలకు ఎప్పుడు అందుబాటులో ఉంచనుందన్న తేదీని మాత్రం ఇంకా వెల్లడించలేదు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే భారత్ వేగంగా స్మార్ట్ ఫోన్లను కోనుగోలే చేస్తున్న దేశంగా నమోదు చేసుకుంది. గత ఒక్క ఏడాదిలోనే రమారమి నాలుగు కోట్ల నలబై లక్షల ఫోన్లు భారత్ లో అమ్ముడయ్యాయని గణంకాలు తెలుపుతున్నాయి. గత ఏడాది గూగుల్ పలు దేశీయ కంపెనీలు స్పైస్, మైక్రోమాక్స్, కార్బన్ కంపెనీల సహకారంతో ప్రవేశపెట్టిన ఆనరాయిడ్ వన్ స్మార్ట్ ఫోన్లు కూడా భారతీయ మార్కెట్లలో బాగానే అమ్మకాలు జరిపాయి. గూగుల్ అనరాయిడ్ ఫ్లోన్లు భారత్ లో మాత్రమే ప్రవేశపెట్టింది.  దీనికి అప్ గ్రేడ్ వర్షన్ గా వస్తున్న పోన్ నెక్సస్ 6గా కంపెనీ వర్గాలు తెలుపుతున్నాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Motorola  micromax  HTC  Karbonn  smartphone  Nexus 9  Nexus 6  tablet google  andriodone phones  

Other Articles