Another fire fox phone yet to enter indian markets

firefox phone, zen mobiles, firefox os, smart phones

Zen mobile to launch fire fox smart phone this month

భారతీయ మార్కెట్లోకి.. మరో ఫైర్ ఫాక్స్ స్మార్ట్ ఫోన్..

Posted: 10/11/2014 01:23 PM IST
Another fire fox phone yet to enter indian markets

భారతీయ మార్కెట్లోకి మరో ఫైర్ఫాక్స్ ఫోన్ వచ్చేస్తోంది. ఇప్పటికే మూడు ఫైర్ఫాక్స్ ఫోన్లు రాగా, ఇప్పుడు కొత్తగా జెన్ మొబైల్స్ సంస్థ కూడా తమ ఫోన్ను విడుదల చేస్తోంది. ఇది మరో నెలరోజుల్లో మార్కెట్లను ముంచెత్తనుంది. ఫైర్ఫాక్స్ ఓఎస్ ఆధారిత స్మార్ట్ఫోన్ను జెన్ మొబైల్స్ సంస్థ విడుదల చేస్తోందని, ఇది అక్టోబర్ నెలాఖరులోగానే భారత మార్కెట్లోకి విడుదల చేయబోతోందని మొజిల్లా సంస్థ తెలిపింది.

సామాన్యులకు అతితక్కువ ఖర్చుతో స్మార్ ఫోన్ సేవలందించాలని అతితక్కువ ధరతో ఓఎస్ ను రూపొందించిన మాజిల్లా ఫైర్ ఫాక్స్ ఆ దిశగా అడుగులు ముందుకేస్తోంద. ఫైర్ ఫాక్స్ ఓఎస్ తో భారతీయ మార్కెట్లలోకి వచ్చిన స్పైస్ ఫైర్ వన్ ఎంఐ-ఎఫ్ఎక్స్ 1 మోడల్ తో గత ఆగస్టు నెలలో భారతదేశంలోనే తొలిసారిగా స్పైస్ మొబైల్స్ ఫైర్ వన్ ఎంఐ- ఎఫ్ఎక్స్1 ఫోన్ను విడుదల చేసింది. కేవలం ఈ కామర్స్ ద్వారా ఆన్ లైన్ ట్రేడింగ్ తో మాత్రమే విక్రయాలు జరిపింది. ఆన్ లైన్లో వచ్చిన రెస్సాన్స్ తో ఇక మేజర్ రీటైల్ దుకాణాలలోనూ విక్రయాలు జరపాలని భావిస్తోంది. ఆ తరువాత ఫైర్ ఫాక్స్ ఓఎస్ తో వచ్చిన ఇంటెక్స్ మోబైళ్లు కూడా భారతీయ మార్కెట్లో ఇప్పటికే సంచలనాలను నమోదు చేసకున్నాయి. అతితక్కువ ధరతో అత్యుత్తమ సేవలందించేవిగా వుండటంతో ఇంటెక్స్ ఫొన్ల క్రయవిక్రయాలు జోరందుకున్నాయి. దీంతో పాటు అల్కాటెల్ వన్ టచ్ ఫైర్సి ఫోన్లు కూడా వచ్చాయి.

ఇక తాజాగా జెన్ మొబైల్ కూడా ఫైర్ ఫాక్స్ ఓఎస్ తో మరో సరికొత్త మొబైల్ మోడల్ ను త్వరలో భారత్ లో విడుదల చేయనుంది. తమ మోడల్ కూడా విపరీతమైన సెల్స్ లభిస్తాయని జెన్ మొబైల్ యోచిస్తోంది. ఇదిలావుండగా, తమ ఓఎస్ లతో రూపొందిచిన సెల్ ఫోన్ లు అతి చవక ధరకు లభ్యం కావడంతో ఆసియా ఉపఖండంలో మంచి ఆదరణ వస్తుందని మాజిల్లా ఫైర్ ఫాక్స్ అధ్యక్షుడు డాక్టర్ లీ జాంగ్ తెలిపారు. ఎంట్రీ లెవల్ స్మార్ ఫోన్ల అర్థం తాము తిరగరాశామని, ఆయన అభిప్రాయపడ్డారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : zen mobiles  firefox mobiles  smart phones  firefox os  

Other Articles