Sensex dips below 27k level down 362 points on fund sell off

BSE Sensex, NSE Nifty, India's stock market, Sensex, Stocks, Sensex today, BSE, NSE

Sensex dips below 27K level, down 362 points on fund sell-off

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్, 27 మార్కుకు దిగువన సెన్సెక్స్

Posted: 09/23/2014 04:07 PM IST
Sensex dips below 27k level down 362 points on fund sell off

విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల ప్రభావం నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను. చవిచూశాయి. మదుపరులు విక్రయాలకు తలొగ్గడంతో 362 పాయింట్లను నష్టపోయిన బీఎస్ఈ సెన్సెక్ 27 వేల మార్కుకు దిగువన ముగిసింది. ఇవాళ మార్కెట్లు ప్రారంభం నుంచి స్వల్ప నష్టాలను మూటగట్టకున్న మార్కెట్లు మధ్యాహ్నం తరువాత అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. రియాల్టీ, కాపిటల్ గూడ్స్, మెటల్ రంగాలు తీవ్రంగా నష్టపోయాయి.

మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 267 పాయింట్ల నష్టంతో 26 వేల 939 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ను ముగించింది. అటు నిఫ్టీ కూడా 89 పాయింట్లను కోల్పోయి 8 వేల 57 పాయింట్ల వద్దకు ముగిసింది. ఓఎన్ జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఎస్ బి హెచ్, సన్ ఫార్మా,  ఎల్ అండ్ టి, సిఫ్లా, ఇన్పోసిస్, ఐసీఐసీఐ బ్యాంకు, గెయిల్ , టాటా మెటార్స్, టాటా పవర్, టాటా స్టీల్, టీసీఎస్ సంస్థల షేర్లు నష్టాలను చవిచూశాయి. హిందుస్థాన్ యూనీ లీవర్, ఎన్ టీ పీ సీ, విప్రో, ఐటీసీ లిమిటెడ్, మారుతి సుజుకీ సంస్థల షేర్లు లాభపడ్డాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BSE Sensex  NSE Nifty  India's stock market  Sensex  Stocks  Sensex today  BSE  NSE  

Other Articles