Vizag signs mou with indian railways

Forged,for,MoU,Signs,VIZAG,RINL,Railways,Indian,

Indian Railways RINL-VIZAG Signs MoU for Forged Wheel Factory at Rae Bareli.

VIZAG Signs MoU with Indian Railways.png

Posted: 12/22/2012 05:52 PM IST
Vizag signs mou with indian railways

VIZAG_Signsరైలు చక్రాల తయారీకిగాను రైల్వే శాఖతో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ శుక్రవారం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలిలో రూ.1,000 కోట్లతో ఏటా ఒక లక్ష చక్రాల తయారీ సామర్థ్యం గల ఫోర్జ్‌డ్ వీల్ ఫ్యాక్టరీని ఆర్‌ఐఎన్‌ఎల్ ఏర్పాటు చేయనుంది. లాల్‌గంగ్ వద్ద ఉన్న రైల్ కోచ్ ఫ్యాక్టరీకి సమీపంలో దీనిని నెలకొల్పనున్నారు. చక్రాల తయారీలో భారత్‌లో ఇదే అతి పెద్ద ఫ్యాక్టరీ కానుంది. రైల్వేలకు ఏటా 70 వేల చక్రాలు అవసరమవుతున్నాయి. కొత్త వ్యాగన్లు, కోచ్‌లు పట్టాలెక్కనుండడంతో 2016-17 నాటికి డిమాండ్ ఒక లక్ష చక్రాలకు చేరుకుంటుందని అంచనా. ప్రస్తుతం రైల్వే శాఖ చక్రాల కోసం అధికంగా దిగుమతులపై ఆధారపడింది. కాగా, మూడేళ్లలో ఈ ప్లాంటు ఏర్పాటు కానుంది. హైస్పీడ్ రైళ్లకు కావాల్సిన చక్రాలను సైతం ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. చక్రాల తయారీకి కావాల్సిన ముడి సరుకును వైజాగ్ ప్లాంటు నుంచి సరఫరా చేస్తారు. ఉక్కు శాఖ మంత్రి బేణీ ప్రసాద్ వర్మ, రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సల్ సమక్షంలో ఈ ఒప్పందంపై రైల్వే బోర్డు మెంబర్ మెకానికల్ కేశవ్ చంద్ర, ఆర్‌ఐఎన్‌ఎల్ సీఎండీ ఎ.పి.చౌదరి సంతకాలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gold price moves down in dollar terms
New banks may aid your savings  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles