పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ తన సొంత కంపెనీ రిలయన్స్ గ్యాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ఆర్‌జీటీఐఎల్)ని విక్రయించడానికి గత ఏడాది కాలంగా ప్రయత్నిస్తున్నా కొనే వారే కరువయ్యారు. ప్రభుత్వ రంగానికి చెందిన ఆయిల్ ఇండియా కొనేందుకు ముందుకు వచ్చినా మళ్లీ వెనక్కి వెళ్లిపోయింది. మరో ప్రభుత్వరంగ సంస్థ గెయిల్ ఇండియా.. ఆర్‌జీటీఐఎల్‌పై ఆసక్తి వ్యక్తం చేసినా.. కొనుగోలు ప్రతిపాదనలు ముందుకు సాగటం లేదు. కంపెనీ వేల్యుయేషన్ కుదరకపోవడమే ఇందుకు కారణమని బ్యాంకర్లు చెబుతున్నారు.
గ్యాస్ రవాణా కోసం ఏర్పాటైన ఆర్‌జీటీఐఎల్ ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి గుజరాత్‌లోని భరూచ్ దాకా 1,396 కి.మీ. దూరం మేర వేసిన 48 అంగుళాల ఈస్ట్-వెస్ట్‌పైప్ లైన్‌ని నిర్వహిస్తోంది. కేజీ-డీ6 క్షేత్రంలో ఉత్పత్తయ్యే గ్యాస్‌ను రవాణా చేసేందుకు దీన్ని ఉద్దేశించారు. కంపెనీ దీనిపై రూ. 14,000 కోట్లు వెచ్చించింది. ఇది కాకుండా కొన్ని రోజుల క్రితం దాకా మరో నాలుగు పైప్‌లైన్ల కాంట్రాక్టు కూడా కంపెనీ వద్ద ఉండేది. బిజినెస్ స్టాండర్డ్ పత్రిక కథనం ప్రకారం దీనితో కలిపి కంపెనీని రూ. 10,000 కోట్లకు విక్రయించాలని ప్రమోటర్లు భావిస్తున్నారు. అయితే, ఈ ధర చాలా అధికంగా ఉందని కొనుగోలుపై ఆసక్తి చూపిన కంపెనీలు భావిస్తున్నాయి. కంపెనీకి ఇచ్చిన 4 పైప్‌లైన్ల ఆథరైజేషన్‌ని కేంద్రం రద్దు చేయడంతో, కేవలం ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ కోసమే బిడ్ చేయడంలో అర్థం లేదని ఒక బ్యాంకర్ పేర్కొన్నారు. తాము గతంలో పైప్‌లైన్ కోసం బిడ్ చేశామని, అయితే వేల్యుయేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని గుర్తించామని ఆయిల్ ఇండియా డెరైక్టర్(ఫైనాన్స్) అనంత్ కుమార్ చెప్పారు. దీంతో బిడ్డింగ్ ప్రతిపాదన విరమించుకుని, తమ ప్రధాన వ్యాపారంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more