Oilmin withdraws note opposing kg gas price hike

Oil Ministry,KG-D6,RIL,Reliance Industry

The Oil Ministry has withdrawn a note it had circulated to the members of a ministerial panel opposing hike in price of gas produced by Reliance Industries, as the Rangarajan Committee is examining pricing of the fuel.

OilMin withdraws note opposing KG gas price hike.png

Posted: 11/21/2012 07:46 PM IST
Oilmin withdraws note opposing kg gas price hike

KG_gas_price_hikeకేజీ బేసిన్ గ్యాస్ ధర పెంపు కోసం ప్రయత్నిస్తున్న రిలయన్స్ తన పంతాన్ని నెగ్గించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేజీ బేసిన్‌లో ఉత్పత్తి చేస్తున్న సహజవాయువు ధరను పెంచాలన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ డిమాండ్‌కు వ్యతిరేకంగా తయారు చేసిన నోట్‌ను వెనక్కి తీసుకోవాలని చమురు మంత్రిత్వ శాఖ హఠాత్తుగా నిర్ణయించింది. . కేజీ గ్యాస్ ధర పెంపుకోసం రిలయన్స్ గట్టిగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా అక్టోబర్ మొదటి వారంలో చమురు మంత్రిత్వ శాఖ ఒక నోట్‌ను తయారు చేసి సాధికార మంత్రుల బృందంలోని సభ్యులకు సర్క్యులేట్ చేసింది. వాస్తవానికి తొలుత కుదిరిన ఒప్పందం ప్రకారం, కేజీ బేసిన్ గ్యాస్ ధరను 2014 ఏప్రిల్‌లో మాత్రమే సమీక్షించాల్సి ఉంది. అయితే ఈ లోపే ధరను అంతర్జాతీయ ధరలకు దీటుగా పెంచాలని రిలయన్స్ ప్రభుత్వంపై లోపాయకారిగా ఒత్తిడి తెస్తోంది.

జైపాల్‌రెడ్డి చమురు శాఖ మంత్రిగా ఉన్నంత కాలం ఈ ప్రతిపాదనలను గట్టిగా ప్రతిఘటించారు. ఈ శాఖనుంచి ఆయన్ను పక్కకు తప్పించి వీరప్ప మొయిలీకి పగ్గాలు అప్పగించిన తర్వాత, చమురు శాఖలో పావు లు రిలయన్ప్‌కు అనుకూలంగా కదులుతున్నట్టుగా వార్తలు వస్తున్నా యి. తాజాగా గ్యాస్ ధ ర పెంపు ప్రతిపాదనల కు వ్యతిరేకంగా సర్క్యులేట్ చేసిన నోట్‌ను ఉపసంహరించడం అనుమానాలకు తావిస్తోంది. ప్రధాని మన్మోహన్ సింగ్ స్వయంగా నియమించిన రంగరాజన్ కమిటీ కేజీ బేసిన్ గ్యాస్ ధరకు సంబంధించిన అంశాలనే పరిశీలిస్తున్నందున, నోట్ ఉపసంహరణ నిర్ణయం తీసుకున్నట్టుగా చమురు మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నప్పటికీ ఈ వ్యవహారం సందేహాలకు తావిచ్చేలా ఉందని పరిశీలకులు అంటున్నారు. దేశీయంగా ఉత్పత్తి చేసే సహజవాయువు ధర నిర్ణయానికి విధివిధానాలు, మార్గదర్శకాలను సూచించడంతో పాటు, భవిష్యత్తులో చమురు, సహజవాయువు అన్వేషణ కాంట్రాక్టులు ఎలా ఉండాలన్న విషయంపై కూడా రంగరాజన్ కమిటీ సిఫారసులు చేస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lic allowed to buy up to 30 equity in a company
Online shopping yet to pick up in india survey  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles