అగ్రశ్రేణి ఫార్మా కంపెనీలు ఔషధ విక్రయాల్లో పెద్దఎత్తున ప్రజల్ని మోసగిస్తున్న వైనం కార్పొరేట్ వ్యవహారాల శాఖ జరిపిన ఒక అధ్యయనంలో బట్టబయలైంది. గ్లాక్సో, ఫైజర్, ర్యాన్‌బాక్సీ వంటి బడా సంస్థలు జనం విరివిగా వినియోగించే పలురకాల ఔషధాలను వాస్తవ ఉత్పత్తి ధర కంటే కనీసం పదిరెట్లు ఎక్కువకు విక్రయిస్తున్నట్లు ఎంసిఏ కాస్ట్ అడిట్ బ్రాంచ్ అధ్యయనం వెల్లడించింది. గ్లాక్సో ఉత్పత్తిచేసే కాల్‌పాల్, ఫైజర్ కోరెక్స్ కఫ్ సిరప్, ర్యాన్‌బాక్సీ రివైటల్, డాక్టర్ రెడ్డీస్ ఒమెజ్, అలెంబిక్ అజిత్రాల్ తదితర ఎన్నోరకాల మందులు వాస్తవ ఉత్పత్తి ధర కంటే 1123% అధికంగా విక్రయిస్తున్నాయని నివేదిక వెల్లడించింది.సర్వేలో వెల్లడైన వాస్తవాలపై ఆందోళన చెందిన కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి వీరప్పమొయిలీ రసాయనాలు ఎరువుల శాఖ, ఆరోగ్య శాఖ మంత్రులకు ఈవిషయాన్ని తెలుపుతూ లేఖలు రాశారు.
ఈ అంశంలో ర్యాన్‌బాక్సీ, ఫైజర్, జైడస్ క్యాడిలా, సిప్లాకు ఈమెయిల్స్ పంపినప్పటికీ ఆ కంపెనీల నుంచి ఎలాంటి స్పందన లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ర్యాన్‌బాక్సీ, డాక్టర్ రెడ్డీస్, వైత్, ఎఫ్‌డిసి, అలెంబిక్, గ్లాక్సో, ఫైజర్, యుఎస్‌వి, ఎల్డర్‌ఫార్మా, జైడస్ క్యాడిలా, వాకార్డ్, సిప్లా తదితర ప్రధాన సంస్థలు తయారుచేసి మార్కెట్ చేస్తున్న ఔషధాలను ఎంసిఏ తమ అధ్యయనంలో కవర్ చేసింది. షెడ్యూల్డ్ డ్రగ్స్ అయిన పక్షంలో ఆ మందుల ఉత్పత్తి వ్యయం కంటే 100% వరకు అధికంగా ధర నిర్ణయించేందుకు నేషనల్ ఫార్మా ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పిపిఏ) అనుమతి వుంది. కానీ పలు కంపెనీలు సాధారణ మందులను 203% నుంచి 1123% వరకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని ఎంసిఏ నివేదిక పేర్కొంది. అలాగే అధికంగా అమ్ముడయ్యే అమ్లోడొపైన్, మెటఫార్‌మిన్, సిప్రొఫ్లోక్సాసిన్, అజిత్రోమైసిన్ వంటి బ్రాండ్స్ విషయంలోనూ ప్రాఫిట్ మార్జిన్‌లు చాలా ఎక్కువగా ఉన్నాయని సర్వే తెలియజేసింది. బడా కంపెనీలు తయారుచేసే 21 ఫార్ములేషన్స్‌పై జరిపిన అధ్యయనంలో ఉత్పత్తి వ్యయం కంటే ఎంఆర్‌పి కనీసం పదిరెట్లు ఎక్కువ ఉన్నట్లు తేలిందని ఎంసిఏ పేర్కొంది. గ్లాక్సో జైలోరిక్ ట్యాబ్లెట్ల రిటైల్ ధర ఉత్పత్తి వ్యయం కంటే 1123% ఎక్కువ వుంది. అలాగే ర్యాన్‌బాక్సీ రివైటల్ (858%), జైడస్ క్యాప్ ఓసిడ్ (753%), యుఎస్‌వి జైక్లోమెట్ (746%) ఇందుకు మరికొన్ని ఉదాహరణలుగా సర్వే తెలియజేసింది.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more